ప్రముఖ సీనియర్ నటిని దారుణంగా వేధించిన భర్త!

టీవీ సీరియల్స్ లో సంచలనం సృష్టించిన ‘అమృతం’ సీరియల్ గురించి తెలియని వాళ్ళంటూ ఉండరు. ఈ సీరియల్ లో ఆంజనేయులు (గుండు హనుమంతరావు) భార్య శాంతగా నటించి మెప్పించిన రాగిణి అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘జులాయి’ అష్టాచమ్మా’ ‘భలే భలే మగాడివోయ్’ ‘గాయం’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో కూడా నటించింది. అలా తన కెరీర్ ను సాగిస్తోన్న ఈమె తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇంటర్వ్యూ ఇచ్చింది.

అందులో తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది. రాగిణి మాట్లాడుతూ.. “నా చిన్నతనంలోనే నా తండ్రికి పక్షవాతం రావడంతో డాన్స్ ప్రదర్శనలు ఇస్తూ ఇంటి ఖర్చులు చూసుకునేదాన్ని. నాకు పన్నెండేళ్ళ వయసులోనే పెళ్లైంది, ఆ సమయంలోనే బాబు కూడా పుట్టాడు. నా భర్తకి యాక్టింగ్ ఫీల్డ్ అంటే అనుమానం. నన్ను బాగా హింసించేవాడు. పెళ్ళైన ఆరు నెలల నుండే హింసించడం మొదలుపెట్టాడు. తప్పుడు దారుల్లో తిరిగైనా సంపాదించమని వేధించేవాడు.

ఎవడితోనైనా పడుకుని సంపాదించుకురా అంటూ బలవంతం చేసేవాడు. అలాంటి తప్పుడు పనులు చేయడం ఇష్టం లేదని చెప్పినా వినేవాడు కాదు. ఆ బాధలు భరించలేక నా భర్త నుండి పెళ్లైన ఏడాదికే విడిపోయాను. ఇక అదే సమయంలో పెళ్ళి ఫొటోలన్నీ తగలబెట్టేసి వెళ్లిపోయాడు. అప్పటి నుండీ నా కొడుకుతోనే జీవిస్తున్నాను. ప్రస్తుతం నా కొడుకు జర్మనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు. నన్ను బాగా చూసుకుంటున్నాడు” అంటూ చెప్పుకొచ్చింది.

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!

Most Recommended Video

మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్‌ టాలీవుడ్‌ హీరోలకు కలిసొచ్చిందా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus