నటనకు విద్యకు సంబంధం లేదు. ఏమి చదువుకోకపోయినా కొందరికి నటన కళ సొంతమవుతుంది. బాగా చదువుకున్న వారు మేకప్ వేసుకోవడానికి వెనకడుగు వేస్తుంటారు. అయితే మన టాలీవుడ్ హీరోలు క్లాసుల్లో ఫస్ట్ వచ్చిన, గ్రాడ్యువేషన్ పూర్తి చేసినా సినిమాలవైపు అడుగులు వేశారు. అభిమానులతో జేజేలు అందుకున్నారు. మహానటుడు నందమూరి తారక రామారావు, సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణలు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
కింగ్ అక్కినేని నాగార్జున, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, నితిన్, గోపిచంద్ లు ఇంజినీరింగ్ కంప్లీట్ చేసి సినీ ఫీల్డ్ వైపు వచ్చారు. వెంకటేష్ (ఎంబీఏ), నందమూరి కళ్యాణ్ రామ్ (ఎంఎస్) ఉన్నత విద్యను అభ్యసించారు. దాదా సాహెబ్ అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావు పది వరకే చదివినా తన క్రమ శిక్షణతో అందరికీ పాఠాలు చెప్పారు. ఇంటర్ మీడియట్ చదివిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ యూత్ ఐకాన్ గా నిలిచారు.