సినిమాలు – రాజకీయాలకు విడదీయలేని బంధం ఉంది. సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వెళ్తుంటారు. అలాగే రాజకీయాలు సినిమాల్లోకి వస్తుంటాయి. మన నాయకులు చాలామంది రాజకీయ నేపథ్యంలో సినిమాలు చేస్తుంటారు. ఇలాంటి ఫార్ములాకు మంచి పేరొస్తుంది కూడా. అయితే ఒకేసారి అగ్ర హీరోలు ఎక్కువమంది పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్లో సినిమాలు చేయడం ఆసక్తికరమనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్‌లో ఇలాంటి రాజకీయ సినిమాలు వరుసగా రూపొందుతున్నాయి.
* మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘లూసిఫర్’ను తెలుగులో ‘గాడ్‌ఫాదర్’గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రాజకీయాల ప్రస్తావన చాలావరకు ఉంటుంది. దానికి సిస్టర్ సెంటిమెంట్ యడ్ అయ్యి ఉంటుంది. చిరు నోట రాజకీయ డైలాగ్‌లు వినిపిస్తాయి.
* బాలకృష్ణ – గోపీచంద్ మలినేని సినిమా కూడా రాజకీయ నేపథ్యమున్న చిత్రమే అంటున్నారు. ఇందులో ఇద్దరు బాలకృష్ణలు ఉండగా ఓ బాలయ్య.. ఓ ప్రాంతాన్ని తన మాటతో శాసించే రాజకీయ నాయకుడిగా కనిపిస్తారు అని చెబుతున్నారు.
* మహేష్‌బాబు – త్రివిక్రమ్ కలయికలో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్టులో ప్రారంభమవుతుంది అని చెబుతున్న ఈ సినిమాలో మహేష్ మరోసారి రాజకీయ నాయకుడిగా కనిపిస్తాడు అంటున్నరు. పాలిటిక్స్ మీద త్రివిక్రమ్ మార్కు పంచులు ఈ సినిమాలో ఉంటాయట.
* రామ్‌చరణ్ – శంకర్ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ మూడు పార్శ్వాలున్న పాత్రలో కనిపిస్తాడని అంటున్నారు. అందులో ఓ పాత్రకు రాజకీయాలతో సంబంధం ఉంటుందట. మరోపాత్ర ప్రభుత్వాధికారి అంటున్నారు. ఆ లెక్కన ఫుల్ పాలిటిక్స్ పక్కా.
* తారక్‌ను స్టూడెంట్ లీడర్‌గా చూపించాలని కొరటాల శివ చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో మొదలవ్వనున్న సినిమాలో కాలేజీ పాలిటిక్స్ చూపిస్తారు అనే మాటలు వినిపిస్తున్నాయి. మొన్నీమధ్య వచ్చిన టీజర్‌లో ఇదే మాటలు విన్నాం కూడా.
* పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో పవన్ లెక్చరర్‌గా కనిపిస్తాడని అంటున్నారు. అయితే ఈ సినిమాలో స్టూడెంట్ రాజకీయాల గురించి చర్చిస్తారని తెలుస్తోంది. మరి నాయకుడు పవనేనా అనేది చూడాలి.
ఇలా స్టార్ హీరోలు చాలామంది రాజకీయ ‘నాయకులు’ అవుతున్నారు. చూద్దాం ఎవరి రాజకీయానికి బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురుస్తుందో?
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!