ఆ ముగ్గురు తప్ప మిగిలిన టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఎక్కడెక్కడ షూటింగ్లు చేస్తున్నారంటే..?

కోవిడ్ వల్ల పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను ఫినిష్ చేసే పనిలో స్టార్ హీరోలంతా బిజీగా గడుపుతున్నారు. ఒక్క ముగ్గురు హీరోలు తప్ప. ప్రభాస్, చిరంజీవి, రాంచరణ్, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలు షూటింగులు చేసుకుంటుంటే అల్లు అర్జున్, ఎన్టీఆర్ మాత్రం హాలిడేస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు అయితే ‘సర్కారు వారి పాట’ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు.అల్లు అర్జున్ ‘పుష్ప 2’ షూటింగ్ జూలై లో మొదలుకానుంది.

ఎన్టీఆర్ పుట్టినరోజు నాడు కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు వంటి దర్శకుల సినిమాలను అనౌన్స్ చేసే పనిలో ఉన్నాడు. అయితే షూటింగ్లలో పాల్గొంటున్న స్టార్ హీరోలంతా హైదరాబాద్లో ఉన్నారు. తమ సినిమాకు తగ్గ లొకేషన్లలో హ్యాపీగా షూటింగ్ చేసుకుంటున్నారు.విజయ్ దేవరకొండ మాత్రం కశ్మీర్లో షూటింగ్ షూటింగ్ చేసుకుంటున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో అతను చేస్తున్న ‘ఖుషి’ మూవీ షూటింగ్ అక్కడ జరుగుతుంది.

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ మూవీ శంకర్ పల్లి సెట్ లో జరుగుతుంది. మోహన్ రాజా ఈ చిత్రానికి దర్శకుడు.

బాలయ్య- గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ప్రస్తుతం ఐటెం సాంగ్ చిత్రీకరణ జరుగుతుంది.

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లోని అన్నపూర్ణ 7 ఎకర్స్ లో జరుగుతుంది.

చరణ్- శంకర్ ల షూటింగ్ గోల్కొండ వద్ద జరుగుతుంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

రవితేజ నటిస్తున్న ‘రావణాసుర’ షూటింగ్ హైదరాబాద్లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. సుధీర్ వర్మ ఈ చిత్రానికి దర్శకుడు.

ఇక మిడ్ రేంజ్ హీరోలు, కుర్ర హీరోల సినిమాల షూటింగ్లు కూడా హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, రామోజీ ఫిలిం సిటీ వంటి వాటిలో జరుగుతున్నాయి.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!
‘భద్ర’ టు ‘అఖండ’.. బోయపాటి డైరెక్ట్ చేసిన సినిమాల కలెక్షన్లు..!
‘దూకుడు’ టు ‘సర్కారు వారి పాట’.. ఓవర్సీస్ లో మహేష్ బాబు 1 మిలియన్ మూవీస్ లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus