Tollywood: సమ్మర్ బాక్సాఫీస్.. బిగ్ సినిమాలతో బీభత్సమే..!

టాలీవుడ్‌లో (Tollywood) హీట్ పెరిగే సమయం రానే వచ్చేసింది. వేసవి సెలవుల సమయంలో థియేటర్లు హౌస్‌ఫుల్ అవుతాయి, అందుకే నిర్మాతలు తమ బిగ్ ప్రాజెక్ట్‌లను ఈ సీజన్‌కు ప్లాన్ చేస్తారు. అయితే ఈ సారి కొన్ని భారీ సినిమాలు అంచనాలను అందుకోలేక సమ్మర్ రేసు నుంచి తప్పుకున్నాయి. చిరంజీవి (Chiranjeevi)  విశ్వంభర (Vishwambhara), ప్రభాస్ (Prabhas) రాజా సాబ్ (The Rajasaab) వాయిదా పడిన నేపథ్యంలో, మిడ్రేంజ్ హీరోల సినిమాలు భారీ స్థాయిలో బరిలో దిగుతున్నాయి. అలాగే బాలీవుడ్, తమిళ్, మలయాళం నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Tollywood

మార్చి 14న కిరణ్ అబ్బవరం  (Kiran Abbavaram) దిల్ రూబా(Dilruba) , నాని (Nani) బ్యానర్ నుంచి వస్తున్న ప్రియదర్శి (Priyadarshi Pulikonda) కోర్ట్ (Court)  సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. మార్చి 28న నితిన్ (Nithiin) రాబిన్‌హుడ్ (Robinhood), సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన మ్యాడ్ స్క్వేర్ (Mad Square) విడుదల కానున్నాయి. అదే రోజు తమిళ స్టార్ విక్రమ్ (Vikram) నటించిన వీర ధీర శూరన్ పార్ట్ 2 (Veera Dheera Sooran Part -2) మరియు మలయాళ బిగ్ బడ్జెట్ మూవీ ఎల్ 2: ఎంపురాన్ (L2: Empuraan)  విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మార్చి 30న సల్మాన్ ఖాన్ (Salman Khan), రష్మిక మండన్నా (Rashmika Mandanna) నటించిన బాలీవుడ్ మూవీ సికిందర్ (Sikandar) కూడా రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ నెలలోనూ హాట్ రిలీజులు ఉన్నాయి.

ఏప్రిల్ 4న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) భైరవం (Bhairavam) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఏప్రిల్ 10న సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) జాక్ (Jack), అజిత్ (Ajith Kumar)  గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly), సన్నీ డియోల్ (Sunny Deol) జాత్ (Jaat) సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఏప్రిల్ 17న కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి విడుదల కానుంది. ఏప్రిల్ 18న అనుష్క (Anushka Shetty) ప్రధాన పాత్రలో నటించిన ఘాటీ (Ghaati), సుందరకాండ, కేసరి చాప్టర్ 2 సినిమాలు ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఏప్రిల్ 25న మంచు విష్ణు కన్నప్ప భారీ తారాగణంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయనున్నాడు.

కాగా, మే నెలలో అసలైన పోటీ మొదలవనుంది. మే 1న నాని (Nani) హిట్ 3 (HIT 3) (ది థర్డ్ కేస్) తో పాటు సూర్య (Suriya) రెట్రో (Retro), బాలీవుడ్ మూవీ రైడ్ 2 రిలీజ్ కానున్నాయి. మే 9న పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు  (Hari Hara Veera Mallu)  థియేటర్లలోకి రాబోతుంది. అదే రోజున నితిన్ తమ్ముడు (Thammudu) కూడా రిలీజ్ ప్లాన్ చేసుకున్నాడు. కానీ పవన్ సినిమా కన్‌ఫర్మ్ అయితే, నితిన్ మరో డేట్‌కు వెళ్లే అవకాశం ఉంది.

మే 21న మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకనింగ్ రాబోతుంది. ఇక మే 30న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కింగ్‌డమ్ (Kingdom) బాక్సాఫీస్ రేసులోకి దిగనున్నాడు. ఇటీవల పెద్ద సినిమాలు వాయిదా పడటంతో, మిడ్ రేంజ్ సినిమాలకు బాగా లాభమవుతుంది. ముఖ్యంగా మే 9, మే 30 డేట్స్ బిగ్ సినిమాలతో హీట్ పెంచబోతున్నాయి. మరి ఈ సమ్మర్ ఎవరి హవా కొనసాగుతుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus