2017 టాలీవుడ్ మొనగాళ్లు

తెలుగు చిత్ర పరిశ్రమకు 2017 ఆనందాన్నిచ్చింది. ఎక్కువ శాతం సినిమాలు విజయం సాధించి లాభాలను అందించింది. కొంతమంది హీరోలకు ఈ ఏడాది మరిచిపోని హిట్స్ ను కానుకగా ఇచ్చింది. ఈ ఏడాది టాలీవుడ్ మొనగాళ్లగా పేరు తెచ్చుకున్న హీరోలపై ఫోకస్…

మెగా హిట్ మెగాస్టార్ చిరంజీవి తొమ్మిదేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చేతికి రఫ్ ఆడించే తత్వం పోలేదు. ఖైదీ నంబర్ 150 మూవీతో బాక్స్ ఆఫీస్ ని బాస్ షేక్ చేయించారు. మాస్ డైరక్టర్ వి వి వినాయక్ దర్శకత్వంలో ఆయన నటించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ అయి రికార్డులకు కొత్త టార్గెట్ ని ఫిక్స్ చేయించింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మించిన ఈ ఫిల్మ్ విడుదలయిన అన్నీ థియేటర్లలో హౌస్ ఫుల్ కలక్షన్స్ తో 150 కోట్లను వసూలు చేసింది.

రారాజు బాలకృష్ణ నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి అందరి ప్రశంసలు అందుకుంది. జనవరి 12న రిలీజ్ అయిన బాలయ్య వందో మూవీ కలక్షన్ల వర్షం కురిపించింది. ఉత్తమ చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న శాతకర్ణిని తెలుగు జాతి మొత్తం వీక్షించి విజయం అందించింది. అలాగే పూరీ డైరెక్షన్‌లో వచ్చిన “పైసావసూల్‌” కూడా అలరించింది.

ప్రభాస్‌రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన బాహుబలి కంక్లూజన్ సంచలనం సృష్టించింది. నాలుగు భాషల్లో రిలీజ్ అయిన ఈ మూవీ అన్ని రికార్డులను కొల్లగొట్టింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా బాబహుబలి-2 రికార్డుకెక్కింది. ఈ చిత్రంతో యంగ్ రెబల్ స్టార్ ఇండియన్ స్టార్ గా ఎదిగారు.

రానా రానా ఈ సంవత్సరం బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి .. సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవే. బాహుబలిలో విలన్ గా రచ్చ చేశారు. సబ్‌మెరైన్‌ కథతో తెరకెక్కిన ఘాజీ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా పాత్రకు ప్రాణం పోశారు. “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో విలక్షణ రాజకీయ నాయకుడిగా రానా నట విశ్వరూపాన్ని చూపించారు. రానాకు ఈ ఏడాది మూడు హిట్లు వచ్చాయి.

విజయ్‌ దేవరకొండఈ ఏడాది విజయ్‌ దేవరకొండ ని స్టార్ ని చేసింది. అతను చేసిన అర్జున్‌ రెడ్డి సినిమా వివాదాల నడుమ పెద్ద విజయాన్ని సాధించింది. అద్భుతమైన నటనతో విజయ్‌ అందరి ప్రశంసలు అందుకున్నాడు.

ఎన్టీఆర్‌బాబీ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ఈ ఏడాది రిలీజ్ అయి సూపర్ హిట్ గా నిలిచింది. జై, లవ, కుశ పాత్రల్లో తారక్ నటవిశ్వరూపాన్ని చూపారు. వరుసగా మరో హిట్ ని తన ఖాతలో వేసుకున్నారు.

నానినేచురల్ స్టార్ నాని నాన్ స్టాప్ గా హిట్స్ అందుకుంటున్నారు. ఈ ఏడాది మరో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. అతను చేసిన చిత్రాలు నేను లోకల్‌, నిన్ను కోరి, ఎంసీఏ.. యువత మెప్పు అందుకొని విజయ తీరం చేరాయి.

శర్వానంద్‌ఈ ఏడాది శతమానం భవతి, రాధ, మహానుభావుడు వంటి మూడు సినిమాలతో శర్వానంద్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. శతమానం భవతి సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. రాధ పర్వాలేదనిపించినా.. మహానుభావుడుతో హిట్‌ కొట్టారు.

అల్లు అర్జున్‌సరైనోడు వంటి యాక్షన్ సినిమా తర్వాత.. ఈ సంవత్సరం “దువ్వాడ జగన్నాథం” గా అల్లు అర్జున్ వచ్చారు. హరీశ్‌ శంకర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీలో కామెడీని, యాక్షన్ ని మిళితం చేసి విజయాన్ని అందుకున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus