ప్రముఖ దర్శకుడికి మాతృ వియోగం!

తెలుగు, తమిళ, హిందీ భాషలలో అనేక సినిమాలకు దర్శకత్వం మరియు నిర్మాతగా వ్యవహరించిన T L V ప్రసాద్ తల్లిగారు తాతినేని అన్నపూర్ణ ఇక లేరు. ఆమె వయసు 91 సంవత్సరాలు. (1930-2021) అలనాటి NTR, ANR, శోభన్ బాబు లాంటి దిగ్గజ నటులతోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఎందరో నటీ నటుల చిత్రాలకు దర్శకుడిగా వ్యవహరించిన అలనాటి దర్శకుడు తాతినేని ప్రకాశరావుగారి భార్య అన్నపూర్ణ.

వీరి కుమారుడు ప్రముఖ చలన చిత్ర దర్శకుడు TLV ప్రసాద్ కాగా, కుమార్తె లీల అమెరికాలో స్థిరపడ్డారు. నాని నటించిన భీమిలీ కబడ్డీ జట్టు సినిమాతో దర్శకుడిగా పరిచయమై SMS, శంకర, వీడెవడు లాంటి హిట్స్ అందించిన నేటి తరం దర్శకుడు తాతినేని సత్య అన్నపూర్ణ గారి మనవడు. తన ఇంటినుండే మూడు తరాల చలన చిత్ర దర్శకులను అందించిన అన్నపూర్ణ గారి పరమపదం బాధాకరం.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus