Samantha: సినిమాలు తగ్గించడానికి కారణమదే.. ఓపెన్‌ అయిన సమంత!

సమంత కెరీర్‌ ప్రారంభమవవ్వడానికి చాలా సమయం పట్టింది. వరుస ప్రయత్నాల తర్వాత హీరోయిన్‌ అయింది.. ఆ వెంటనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అయితే వివిధ కారణాల వల్ల ఆమె కెరీర్‌ స్లో అయింది. అయితే ఆ అడ్డంకుల్ని దాటుకొని తిరిగి సినిమాలు ప్రారంభించింది. కొత్త సినిమా పరిశ్రమలవైపు, కొత్త తరం కంటెంట్‌ వైపు కూడా వెళ్లింది. అయితే ఇప్పుడు సమంత సినిమాల ఫ్లో బాగా స్లోగా ఉంది. సినిమాకు సినిమాకు చాలా గ్యాప్‌ తీసుకుంటోంది. దీంతో ‘వేగం ఎందుకు తగ్గింది సామ్‌’ అంటూ ఫ్యాన్స్‌ ఆమెను సోషల్‌ మీడియాలో అడుతుగుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు సమంత దీనికి ఆన్సర్‌ ఇచ్చింది.

Samantha

నటిగానే కాకుండా నిర్మాతగానూ ఇప్పుడు అలరిస్తోంది సమంత. ఈ క్రమంలో ప్రముఖ మ్యాగజీన్‌ గ్రాజియా ఇండియా కొత్త ఎడిషన్‌ కవర్‌ పేజీపై సమంత అదిరిపోయే లుక్‌లో దర్శనమిచ్చింది. కవర్‌ పేజీలో ఉందంటే ఆటోమేటిగ్గా లోపల ఆమె ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. అందులో తెలుగు మీడియాకు చెప్పని ఎన్నో ఆసక్తికర విషయాలు ఉంటాయి. అందులో ఒకటి ఆమె సినిమాల ఆలస్యానికి కారణం. ‘‘ఎన్ని సినిమాలు చేశామనేది కాదని.. ఎంత మంచి చిత్రాలు తీశామనేది ముఖ్యం’’ అనేదే ఆమె కారణం.

15 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నాను. గతంతో పోలిస్తే ఇప్పుడు నాలో చాలా మార్పు వచ్చింది. గొప్ప పనులు చేసే స్థాయికి చేరుకున్నాను. ఇప్పుడు ఫిట్‌నెస్‌, సినిమాలపై దృష్టిపెట్టాను. ఈ క్రమంలో మంచి సినిమాలు, వెబ్‌ సిరీసుల్లో భాగమయ్యాను. ఇదంతా నటన పట్ల ప్యాషన్‌తోనే. అలాగే ప్రత్యేకంగా ఏదో గుర్తింపు సాధించాలని ప్రాజెక్ట్‌లు ఎంచుకోవడం లేదు. మనసుకు దగ్గరగా ఉన్న కథలే ఎంచుకుంటున్నాను అని సమంత చెప్పుకొచ్చింది.

సినిమాలతోపాటు శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అనుకుంటున్నాను. గతంలోలా ఒకేసారి ఐదు సినిమాలు చేయను. ఎందుకంటే నా శరీరం చెప్పేది వినాలని నిర్ణయించుకున్నాను. అందుకే పనిని తగ్గించుకున్నాను. అయితే తక్కువ సినిమాలే చేసినప్పటికీ ప్రేక్షకుల మనసుకు నచ్చేవే ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం సమంత ‘రక్త్‌ బ్రహ్మాండ్‌: ది బ్లడీ కింగ్‌డమ్‌’ వెబ్‌సిరీస్‌లో నటిస్తోంది. రాజ్‌, డీకే తెరకెక్కిస్తున్నారు.

అందరూ సెప్టెంబర్ 12 పైనే పడ్డారు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus