“ఇంద్ర లాంటి ఇండస్ట్రీ హిట్ ఇస్తే చిరంజీవి కనీసం నాకు విస్తరాకేసి అన్నం కూడా పెట్టలేదు” నిన్న ఉదయం ఉన్నట్లుండి ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చిన్న కృష్ణ అనే రచయిత అన్న మాట ఇది. చిరంజీవికి “ఇంద్ర”, బాలకృష్ణకి “నరసింహ నాయుడు” లాంటి ఇండస్ట్రీ హిట్ చిత్రాలకు కథలు అందించిన చిన్నికృష్ణ అల్లు అర్జున్ పరిచయ చిత్రమైన “గంగోత్రి”కి కూడా కథ అందించారు. కొన్నాళ్ళ విరామం అనంతరం “బద్రీనాథ్” అనే కథ రాసిన చిన్నికృష్ణ.. ఆ సినిమాతో అల్లు అర్జున్ కి ఓ మరపురాని డిజాస్టర్ ను ఇచ్చాడు. ఆ తర్వాత “జీనియస్” అనే మరో అద్భుతమైన కథ కూడా రాశాడండోయ్. 2012లో విడుదలైన “జీనియస్” తర్వాత చిన్నికృష్ణ ఏదో ఇంటర్వ్యూల్లో, కొన్ని సినిమా ఫంక్షన్లకు హాజరవుతూ వచ్చాడు తప్ప మరో కథ రాసింది లేదు.
అలాంటి చిన్న కృష్ణ నిన్న సడన్ గా ప్రెస్ మీట్ లో ప్రత్యక్షమై.. “కాపు సోదరులారా పవన్ కళ్యాణ్ కి ఓటేయ్యకండి. చిరంజీవికి నేను ఇండస్ట్రీ హిట్ ఇస్తే కనీసం నాకు అన్నం కూడా పెట్టలేదు” అని పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడు. అదే చిన్నికృష్ణ “బద్రీనాథ్” ఆడియో ఈవెంట్ లో 3000 రూపాయల అద్దె ఇంట్లో ఉంటున్న నాకు అల్లు అరవింద్ గారు 10 లక్షలు ఇచ్చారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మెగా ఫ్యాన్స్. అయినా.. ఇప్పుడేదో అపోజిషన్ పార్టీలో జాయిన్ అవుతున్నానే గర్వంతో ఇలా అన్నం పెట్టిన మెగా ఫ్యామిలీనే తిట్టడం అనేది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఎప్పటికైనా చిన్నికృష్ణ చేసిన తప్పును తెలుసుకోవడం ఖాయం.