పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పిన ఒకే ఒక్క హీరోయిన్!
- September 16, 2017 / 11:24 AM ISTByFilmy Focus
కథలు, డైరక్టర్స్, హీరోయిన్స్ ఎంపికలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలే వేరు. ఒకే రకమైన లైన్ ఉన్న స్టోరీలను చేయడానికి ఆయన ఒప్పుకోరు. అలాగే హిట్ పెయిర్ అనే సెంటిమెంట్ ని నమ్మరు. ఇప్పటి వరకు రేణు దేశాయ్, శృతి హాసన్ తో మినహా ఎవరితోనూ రెండో సారి నటించలేదు. అందుకే హీరోయిన్స్ పవన్ కళ్యాణ్ తో నటించాలని కోరిక ఉన్నప్పటికీ ఆ విషయాన్నీ బయటికి చెప్పరు. ఒకేసారి మాత్రమే నటించే అవకాశం ఉంది కాబట్టి పవన్ ని కీర్తించే పనులు చేయరు. కానీ ఒకే ఒక బ్యూటీ ఈ రూల్ ని బ్రేక్ చేసింది. పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు చెప్పి వార్తల్లో నిలిచింది. వివరాల్లోకి వెళితే.. ట్విట్టర్లో పవన్ కళ్యాణ్ ని ఫాలో అయ్యేవారి సంఖ్య రెండు మిలియన్ కి చేరింది.
దీంతో పవన్ తన అభిమానులకు శిరసు వంచి కృతజ్ఞతలు కూడా చెప్పారు. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న షాలిని పాండే పవన్ ని శుభాకాంక్షలు చెప్పి ఆశ్చర్యపరిచింది. దీనిపై టాలీవుడ్ వర్గాల ప్రజల్లో చర్చే జరిగింది. పవన్ తో నటించిన, నటించే హీరోయిన్స్ ఎవరూ చేయని ఈ పని చేసి షాలిని పవన్ దృష్టిలో పడింది. అంతేకాదు పవన్ అభిమానుల మనసు గెలుచుకుంది. మరి పవన్ పక్కన నటించే ఛాన్స్ అందుకుంటుందో? లేదో? కాలమే చెప్పాలి.

















