మరో విషాదం.. కారు ప్రమాదంలో సినీ నటి మృతి..

  • March 19, 2022 / 03:22 PM IST

సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నటిగా యూట్యూబర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న గాయత్రి రోడ్డు ప్రమాదంలో కన్ను మూసింది. యూట్యూబర్‌, నటి గాయత్రి గత రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఆమెకు తీవ్రంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. హోలీ వేడుకల అనంతరం జరిగిన ఈ ఘటన వారి కుటుంబంలో అందరిని చేదు అనుభవానికి గురి చేసింది. హొలీ సెలబ్రేషన్స్ అనంతరం విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వెళుతుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై ఒక్కసారిగా బోల్తా కొట్టింది.

Click Here To Watch NEW Trailer

ఇక ఈ ప్రమాదంలో గాయత్రితో పాటు కారులో రోహిత్‌ అనే మరో వ్యక్తి కూడా ఉన్నాడు. ప్రమాదంలో రోహిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఇక గాయత్రీ అక్కడికక్కడే కన్నుమూయగా ప్రస్తుతం రోహిత్ పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. అసలు వివరాల్లోకి వెళితే.. శుక్రవారం హోలీ పండగ సందర్భంగా రోహిత్‌ గాయత్రిని తీసుకొని అటు నుంచి ప్రిసమ్ పబ్‌ కి తీసుకు వెళ్లడం జరిగింది. ఇక పార్టీ ఇద్దరు కూడా కారులో బయలుదేరి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

గాయత్రి కారును డ్రైవ్‌ చేస్తున్నట్లు సమాచారం. కారును అతివేగంగా నడపడడం వల్లనే తీవ్రంగా గాయాలయ్యాయని తెలుస్తోంది. ఇక గాయత్రి మృతి చెందినట్లు వార్తలు రావడంతో ఆమె సన్నిహిత సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు ప్రముఖ టాలీవుడ్‌ నటులు విషాదం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సోషల్ మీడియాలో గాయత్రీ గురించి ఎమోషనల్ గా స్పందించింది.

ఇది చాలా అన్యాయం అంటూ నమ్మడానికి కష్టంగా ఉందని నీతో నాకు ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు ఉన్నాయని అసలు మాటలు రావడం లేదు’ అంటూ ఎమోషనల్ గా వివరణ ఇచ్చింది. అలాగే షణ్ముఖ్ జస్వంత్ కూడా గాయత్రితో ఉన్న ఒక ఫోటోను షేర్‌ చేస్తూ హార్ట్‌ బ్రేక్‌ సింబల్‌ ను పోస్ట్ చేశాడు.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

రాధే శ్యామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus