Boyapati Srinu: బాలయ్య దర్శకుడిపై ట్రోల్స్.. కానీ?

తెలుగులోని టాలెంటెడ్ డైరెక్టర్లలో బోయపాటి శ్రీను ఒకరనే సంగతి తెలిసిందే. ప్రతిభ గల టాలీవుడ్ డైరెక్టర్లలో ఒకరైన బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాలలో కొన్ని సినిమాలు ఊహించని స్థాయిలో విజయాలను అందుకుంటే మరికొన్ని సినిమాలు మాత్రం ఫ్లాప్ అయ్యాయి. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ కాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలను నెటిజన్లు తీవ్రస్థాయిలో ట్రోల్ చేశారు. అయితే దర్శకుడు బోయపాటి శ్రీను ఆ ఫ్లాప్ ను మరిపించేలా అఖండ సినిమాను తెరకెక్కించి ఈ సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్నారు.

ఈ సినిమా విడుదలై 45 రోజులైనా తెలుగు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందనే సంగతి తెలిసిందే. అయితే ఇటీవల విడుదలై థియేటర్లలో పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న హీరో సినిమాలో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బోయపాటి శ్రీనును టార్గెట్ చేశారు. సినిమాలో డైరెక్టర్ హీరోను బాబు అని సంబోధించే విధంగా సీన్లు పెట్టడంతో పాటు బోయపాటి హావభావాలు ఉండేలా చూసుకున్నారు. విలన్ తలను హీరో ఒక్క వేటులో నరికేస్తారని ఆ తలను గద్ద తన్నుకుపోతుందని మొండెం నుంచి బ్లడ్ రైల్వే ట్రాక్ పై పడుతుందని ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ రెడ్ సిగ్నల్ గా మారుతుందని డైరెక్టర్ సినిమాలో సరదాగా ఉండేలా సీన్లు పెట్టుకున్నారు.

బోయపాటిని టార్గెట్ చేసేలా ఉన్న ఈ సీన్ల గురించి శ్రీరామ్ ఆదిత్య ఎలా స్పందిస్తారో చూడాలి. యావరేజ్ టాక్ ను సొంతం చేసుకున్న హీరో మూవీ తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించాల్సి ఉంది. ఫుల్ రన్ లో ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. శ్రీరామ్ ఆదిత్య గత సినిమాలు సక్సెస్ సాధించినా హీరో మాత్రం ఆ సినిమాల స్థాయిలో లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

శ్రీరామ్ ఆదిత్య తర్వాత సినిమాలో ఎవరు నటిస్తారో తెలియాల్సి ఉంది. ఇప్పటివరకు 4 సినిమాలకు ఈ డైరెక్టర్ దర్శకత్వం వహించారు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus