‘పెళ్లిచూపులు’ డైరెక్టర్ షాకిస్తాడా..?

కరోనా వైరస్ ఆరోగ్యపరంగానే కాదు.. మానసికంగా కూడా మనుషుల మీద తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కోవిడ్ సమయంలో అందరూ ఇంట్లోనే ఉంటూ ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడుపుతున్న క్రమంలో బంధాలు బలపడతాయని అనుకుంటే.. అపార్ధాలు చోటుచేసుకొని వ్యక్తుల మధ్య దూరం పెరుగుతోంది. గత రెండేళ్లలో చాలా మంది సెలబ్రిటీ జంటలు విడిపోయి అభిమానులకు షాకిచ్చాయి. ఎంతో ప్రేమగా ఉండే నాగచైతన్య-సమంత విడిపోవడంతో అందరినీ బాధపెట్టింది. రీసెంట్ గా ధనుష్-ఐశ్వర్య తమ 18 ఏళ్ల వివాహబంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు.

ఇలాంటి జంటలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మరో సెలబ్రిటీలు జంట విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. ‘పెళ్లిచూపులు’ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన తరుణ్ భాస్కర్.. తన భార్య లత నుంచి విడిపోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారో లేదో తెలియదు కానీ ఇద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్.. లతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తరుణ్ దర్శకుడిగా సినిమాలు చేయకముందే వీరిద్దరికీ వివాహం జరిగింది. లత వృత్తిరీత్యా ఫ్యాషన్ డిజైనర్. ఆమె గురించి పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించారు తరుణ్ భాస్కర్.

కొన్ని సినిమా ఈవెంట్స్ లో కూడా ఆమె కనిపించింది. వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఇద్దరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉండేది. అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ విడిపోవడం షాకింగ్ అనే చెప్పాలి. మరి ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus