ఎన్ని కమర్షియల్ సినిమాల్లో నటించినా.. పోలీస్ డ్రెస్ లో హీరోయిజం చూపిస్తే వచ్చే కిక్కే వేరు. రాజశేఖర్ కి పోలీస్ స్ట్రోరీ అయిన ‘అంకుశం’ సినిమానే బ్రేక్ ఇచ్చింది. సాయికుమార్ నటించిన ‘పోలీస్ స్టోరీ’ అతడికి ఓవర్ నటి స్టార్ డమ్ ను తీసుకొచ్చింది. ఇక విజయశాంతికి లేడీ అమితాబ్ పేరు తీసుకొచ్చింది కూడా పోలీస్ కథలే. ఈ మధ్యకాలంలో చూసుకుంటే వరుస ప్లాప్స్ ఇబ్బంది పడుతున్న రవితేజకి ‘క్రాక్’ సినిమా స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చింది.
ఇది కూడా పోలీస్ స్టోరీనే. అయితే ఈ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువ వెరైటీ చేసే అవకాశం లేకపోవడంతో రెగ్యులర్ గా నడిచే పోలీస్ కథలను మనవాళ్లు ఎంచుకోరు. కానీ ఇప్పుడు ట్రెండ్ చూస్తుంటే కుర్ర హీరోలు మళ్లీ దాని మీద మనసు పారేసుకున్నట్ల కనిపిస్తోంది. వచ్చే వారం విడుదల కాబోతున్న ‘దివారియర్ ‘సినిమాలో రామ్ తన ఎనర్జీను పూర్తి స్థాయిలో పోలీస్ ఆఫీసర్ గెటప్ లో చూపించబోతున్నారు. ఎక్కువగా సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసే శ్రీవిష్ణు సైతం ఎన్నడూ లేని విధంగా కొత్తగా అల్లూరి అంటూ మీసాలు మెలేసి..
ఖాకీ బట్టలతో విలన్స్ కి సవాల్ విసురుతున్నాడు. అడివి శేష్ నటించిన ‘హిట్ కేస్ 2’ సినిమాలో కూడా హీరోది పోలీస్ ఆఫీసర్ రోలే. ఫస్ట్ పార్ట్ కి కొనసాగింపుగా కాకుండా.. ఫ్రెష్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. విశాల్ ‘లాఠీ’ సినిమా కూడా పోలీస్ కథే. దీనికోసం బాడీ పెంచి, మీసకట్టుతో కనిపించబోతున్నారు విశాల్. ఇదంతా చూస్తుంటే యంగ్ హీరోలు తమ వయసు ముప్పై దాటాక ఈ టైప్ క్యారెక్టర్స్ పై మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది.
సరిగ్గా కుదిరితే పోలీస్ స్టోరీ అనేది సక్సెస్ ఫుల్ ఫార్ములా. రాబోయే రెండు, మూడు నెలల్లోథియేటర్ లలో ఈ పోలీస్ స్టోరీలు సందడి చేయబోతున్నాయి. మరి వీటిలో ఏ సినిమా సక్సెస్ అవుతుందో చూడాలి!
Most Recommended Video
టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!