మెగాస్టార్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టి.. ఘన విజయాలు అయిన సినిమాలు ఇవే..!

  • July 8, 2020 / 07:00 AM IST

ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. కెరీర్ ప్రారంభంలో సెకండ్ హీరోగా అలాగే నెగిటివ్ రోల్స్ పోషించినప్పటికీ.. తరువాత హీరోగా వరుస విజయాలను దక్కించుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ‘ఖైదీ’ చిత్రంతో స్టార్ హీరోగా ఎదిగిన చిరు.. ఆ తరువాత సుప్రీమ్ హీరో బిరుదుని సంపాదించుకుని ‘పసివాడి ప్రాణం’ ‘యముడికి మొగుడు’ వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు. ఇండస్ట్రీకి అడుగుపెట్టి 40 ఏళ్ళు దాటినా ఇంకా నెంబర్ వన్ హీరోగానే కొనసాగుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు,ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలున్నప్పటికీ.. ఇంకా చిరు నెంబర్ వన్ గానే కొనసాగుతున్నారంటే మాటలు కాదు. అంత స్టార్ డం కూడా ఊరికే వచ్చింది కాదు.

స్టార్ హీరో అనగానే కేవలం కాల్షీట్లు ఇచ్చేసి.. తన వంతు షూటింగ్ ఫినిష్ చేసి వెళ్ళిపోయే రకం కాదు చిరు. మొదటి నుండీ కథ పట్ల పూర్తి అవగాహన తెచ్చుకుని అది తనకి సూట్ అవుతుందా లేదా అని తెలుసుకుని.. తరువాత తన శైలికి తగినట్టుగా దానిని మార్చుకుని, మలుచుకుని సినిమా చేస్తుంటారు. తన మార్కెట్ ఎంత ఉంది.. సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టించాలి అనే విషయాలను కూడా దృష్టిలో పెట్టుకునే ఆయన సినిమాలు చేస్తుంటారని ఇండస్ట్రీలో చాలా మంది చెబుతుంటారు. అందుకే చిరంజీవి మెగాస్టార్ అయ్యారని కూడా వారు చెబుతుంటారు. ఇది పక్కన పెట్టేసి ఇప్పటి వరకూ చిరంజీవి సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా అద్భుతమైన కలెక్షన్లను నమోదు చేస్తుండేవట. సరే చిరంజీవి కెరీర్లో అత్యథిక కలెక్షన్లు నమోదు చేసిన సినిమాలేంటి.? వాటి మార్కెట్ కు తగినట్టు ఎలాంటి ఫలితాన్ని అందించాయి.. ఓ లుక్కేద్దాం రండి :

1)సైరా నరసింహారెడ్డి :

ఈ చిత్రానికి 200 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 140 కోట్ల షేర్ ను మాత్రమే నమోదు చేసింది. అయితే మెగాస్టార్ కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన సినిమా ఇదే.

2)ఖైదీ నెంబర్ 150 :

చిరు తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రానికి 92 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 104 కోట్ల షేర్ ను రాబట్టింది.

3)ఇంద్ర :

మెగాస్టార్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్లలో ఒకటైన ‘ఇంద్ర’ చిత్రానికి 13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 27 కోట్ల షేర్ ను రాబట్టింది.

4)శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ :

ఈ చిత్రానికి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 26 కోట్ల షేర్ ను రాబట్టింది.

5)స్టాలిన్ :

ఈ చిత్రానికి 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 23 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

6) శంకర్ దాదా జిందాబాద్ :

ఈ చిత్రానికి కూడా 30 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా.. కేవలం 18 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

7)ఠాగూర్ :

ఈ చిత్రానికి 14 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 24 కోట్ల షేర్ ను రాబట్టింది.

8) జై చిరంజీవ :

ఈ చిత్రానికి 18 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా కేవలం 12కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

9) అన్నయ్య :

ఈ చిత్రానికి 10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరుగగా 13 కోట్ల షేర్ ను రాబట్టింది.

10)అంజి :

ఈ చిత్రానికి 24 కోట్ల బిజినెస్ జరుగగా కేవలం 12 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus