సినిమా థియేటర్లు మళ్లీ పాత రోజులను తలపిస్తున్నాయి. కొత్త సినిమాలకంటే పాత బ్లాక్‌బస్టర్ సినిమాల రీ-రిలీజ్‌లే బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. హీరోల బర్త్‌డేలు, పండుగలు, స్పెషల్ ఈవెంట్స్‌కి పాత హిట్లు మళ్లీ తెరపైకి రావడం ఇప్పుడు కామన్ అయ్యింది. ముఖ్యంగా, ఓటీటీ ట్రెండ్ తర్వాత పలు సినిమాలు కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకుని రీ-రిలీజ్‌లో దుమ్ము రేపుతున్నాయి. ఫ్లాప్‌గా నిలిచిన సినిమాలు (Movies) సైతం రెండో చాన్స్‌లో హవా చూపిస్తున్నాయి.
ఈ రీ-రిలీజ్ రేసులో ఇప్పుడు అగ్రస్థానంలో నిలిచిన సినిమా (Movies) ‘తుంబాడ్’. మొదటి సారి పరిమిత వసూళ్లు సాధించినా, రీ-రిలీజ్‌లో అద్భుతమైన స్పందనతో 37.5 కోట్ల వసూళ్లు రాబట్టి టాప్ పొజిషన్‌లో నిలిచింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్, హారర్ ఫ్యాన్స్ నుండి భారీ మద్దతు తుంబాడ్ రీ-రిలీజ్ సక్సెస్‌కు కారణమయ్యాయి. ఇక యూత్‌ను సర్‌ప్రైజ్ చేసిన సినిమా ‘సనం తేరీ కసమ్’. ఈ రొమాంటిక్ డ్రామా మొదటి సారి పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయినా, రీసెంట్ గా రీ-రిలీజ్‌లో కేవలం 6 రోజుల్లోనే 28.3 కోట్ల వసూళ్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది.
మరోవైపు, హాలీవుడ్ క్లాసిక్ మూవీ (Movies) ‘ఇంటర్‌స్టెల్లార్’ కూడా రీ-రిలీజ్‌లో గట్టిగా దూసుకెళ్లి 18.3 కోట్ల కలెక్షన్ తో టాప్ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హాలీవుడ్ నుంచి కూడా పలు క్లాసిక్ మూవీస్ ఈ రీ-రిలీజ్ వేవ్‌లో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ‘టైటానిక్ 3D’ 18 కోట్ల కలెక్షన్ రాబట్టగా, ఎప్పుడో విడుదలైన ‘అవతార్’ రీ-రిలీజ్‌లో 10 కోట్ల వసూళ్లు సాధించింది. బాలీవుడ్ నుంచి రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ‘యే జవానీ హై దీవానీ’ కూడా రీ-రిలీజ్‌లో 25.4 కోట్లతో టాప్ 5లో నిలిచింది. ఇక దక్షిణాది నుంచి ఈ టాప్ 10 లిస్ట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక సినిమా (Movies) విజయ్ నటించిన ‘ఘిల్లి’. రీ-రిలీజ్‌లో 26.5 కోట్ల వసూళ్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది.
ఇండియాలో టాప్ రీ-రిలీజ్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు:
1. తుంబాడ్: ₹37.5 కోట్లు
2. సనం తేరీ కసమ్: ₹28.3 కోట్లు (6 రోజులు)
3. ఘిల్లి: ₹26.5 కోట్లు
4. యే జవానీ హై దీవానీ: ₹25.4 కోట్లు
5. ఇంటర్‌స్టెల్లార్: ₹18.3 కోట్లు (6 రోజులు)
6. టైటానిక్ 3D: ₹18 కోట్లు
7. షోలే 3D: ₹13 కోట్లు
8. లైలా మజ్ను: ₹11.6 కోట్లు
9. రాక్‌స్టార్: ₹11.5 కోట్లు
10. అవతార్: ₹10 కోట్లు