Brahma Anandam: ‘బ్రహ్మ ఆనందం’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Ad not loaded.

రాజా గౌతమ్  (Raja Goutham) హీరోగా బ్రహ్మానందం  (Brahmanandam) అతి ముఖ్యమైన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మ ఆనందం’(Brahma Anandam). నిఖిల్ ఆర్ వి ఎస్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్క  (Rahul Yadav Nakka) నిర్మించారు. గతంలో ఈయన ‘మళ్ళీ రావా’ (Malli Raava) ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'(Agent Sai Srinivasa Athreya) ‘మసూద’ (Masooda) వంటి హిట్ సినిమాలు నిర్మించారు. ఇక ‘బ్రహ్మ ఆనందం’ సినిమా టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కానీ ఎందుకో ఆశించిన స్థాయిలో ఈ సినిమాకి బజ్ తీసుకురావడంలో టీం విఫలమైంది.

Brahma Anandam

అయినప్పటికీ ఈ సినిమాకి థియేట్రికల్ బిజినెస్ డీసెంట్ గానే జరిగింది. నిర్మాత ట్రాక్ రికార్డు బాగుండటంతో బిజినెస్ బాగా జరిగింది అని స్పష్టమవుతుంది. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతో తెలుసుకుందాం రండి :

నైజాం 3.00 cr
సీడెడ్ 1.00 cr
ఆంధ్ర(టోటల్) 2.00 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 6.00 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.50 cr
వరల్డ్ వైడ్(టోటల్) 6.50 cr

‘బ్రహ్మ ఆనందం’ (Brahma Anandam) చిత్రానికి రూ.6.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. సినిమాకి హైప్ అయితే లేదు. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప.. బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా కష్టం అనే చెప్పాలి.

‘లైలా’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus