ఇప్పటివరకు అమెజాన్ ప్రైమ్ లో ఎక్కువ వ్యూస్ నమోదు చేసిన సినిమాల లిస్ట్…!

ఓటిటి సంస్థల్లో ‘అమెజాన్ ప్రైమ్’ టాప్ ప్లేస్ లో ఉండేది.కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడినప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలను ఎక్కువ రేటు పెట్టి కొనుగోలు చేసింది అమెజాన్ ప్రైమ్ సంస్థ అనే చెప్పాలి. లాక్ డౌన్ లేకపోయినా అమెజాన్ ప్రైమ్ కు మంచి డిమాండ్ ఉందనే చెప్పాలి.థియేటర్లలో విడుదలైన సినిమాకి ఏమాత్రం నెగిటివ్ టాక్ వచ్చినా … అమెజాన్ ప్రైమ్ లో చూసుకుందాంలే.. అని ప్రేక్షకులు లైట్ తీసుకునేవారు అంటే దీనికి ఉండే డిమాండ్ ఏంటన్నది మనం అర్థం చేసుకోవచ్చు. చిన్న సినిమాల నిర్మాతలకు అయితే అమెజాన్ ప్రైమ్ కల్పవృక్షం లా మారిపోయింది.

అయితే సెకండ్ వేవ్ కారణంగా మళ్ళీ లాక్ డౌన్ ఏర్పడడంతో .. అమెజాన్ ప్రైమ్ వారు విడుదలకు సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలను మళ్ళీ నేరుగా ఓటిటి రిలీజ్ చేస్తారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ‘ఏక్ మినీ కథ’ ‘పచ్ఛీస్’ వంటి చిన్న సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.దీంతో ప్రేక్షకులు కొంత డిజప్పాయింట్ అయ్యారనే చెప్పాలి. కాస్త లేటైనా సరే నిర్మాతలు తమ సినిమాలను థియేటర్లలోనే విడుదల చేసుకోవాలని భావిస్తున్నారు. మరోపక్క శాటిలైట్ హక్కులను ముందుగా ఫ్యాన్సీ రేటుకి అమ్మేసిన సినిమాలని ఓటిటి రిలీజ్ చేయడానికి ఛానెల్స్ వారు కూడా అంగీకరించకపోవడంతో కొత్త సినిమాలు ప్రైమ్లో విడుదల కాలేదు అని స్పష్టమవుతుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఇప్పటి వరకు అమెజాన్ ప్రైమ్ లో ప్రేక్షకులు ఎక్కువగా చూసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) వకీల్ సాబ్ :

పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ థియేటర్లలో విడుదలైన 3 వారాలకే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. దీంతో అత్యధిక వ్యూస్ నమోదు చేసి రికార్డ్ సృష్టించింది ఈ చిత్రం.

2)ఆకాశం నీ హద్దురా :

గతేడాది ఈ చిత్రం నేరుగా ప్రైమ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ప్రైమ్ లో ఎక్కువ మంది చూసిన సినిమాగా టాప్ ప్లేస్ ను దక్కించుకుంది ఈ చిత్రం.

3) ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ :

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ చిత్రం కూడా మంచి వ్యూయర్ షిప్ ను నమోదు చేసింది.

4)వి :

నాని- సుధీర్ బాబు.. నటించిన ఈ మూవీ నేరుగా ప్రైమ్లో రిలీజ్ అవడంతో ఎక్కువమందే చూసారు.

5)నిశ్శబ్దం :

అనుష్క నటించిన ఈ చిత్రం కూడా నేరుగా ప్రైమ్లో రిలీజ్ అయ్యింది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నుండీ వచ్చిన మూవీ కావడంతో.. దేనిని కూడా ఎక్కువ మందే చూసారు.

6)హిట్ :

విశ్వక్ సేన్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని కూడా ప్రైమ్ లో ప్రేక్షకులు ఎక్కువగా చూసారు.

7)మిడిల్ క్లాస్ మెలోడీస్ :

ఆనంద్ దేవరకొండ నటించిన ఈ మూవీ నేరుగా ప్రైమ్లో రిలీజ్ అవ్వడం.. పైగా హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు బాగానే చూసారు.

8)మహర్షి :

మహేష్ బాబు 25వ చిత్రం ‘మహర్షి’ ని కూడా ప్రైమ్లో ఎక్కువ సార్లు చూసారు ప్రేక్షకులు.

9)చిత్రలహరి :

సాయి తేజ్ కంబ్యాక్ మూవీ ‘చిత్రలహరి’ ని కూడా ప్రేక్షకులు ప్రైమ్లో ఎక్కువగా చూస్తున్నారు.

10)ఎఫ్2 :

వెంకటేష్- వరుణ్ తేజ్ ల.. ఈ మల్టీస్టారర్ కూడా ప్రైమ్ లో ఎక్కువ వ్యూస్ ను నమోదు చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus