ప్రైమ్ లో టాప్5 సౌత్ సినిమాలే.. ఏ మూవీ స్థానం ఎంతంటే?

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ లో 2022లో ఎక్కువ సంఖ్యలో వ్యూస్ సాధించిన సినిమాలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి. ఈ జాబితాలో పుష్ప ది రైజ్ నంబర్ వన్ స్థానంలో నిలవడంతో బన్నీ ఫ్యాన్స్ తెగ సంతోషిస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమా థియేటర్లలో విడుదలైన మూడు వారాలకు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అయింది. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తం ఆఫర్ చేసిందనే సంగతి తెలిసిందే.

పుష్ప ది రైజ్ సినిమా వల్ల అమెజాన్ ప్రైమ్ కు సబ్ స్క్రిప్షన్లు కూడా పెరిగాయని బోగట్టా. ఈ జాబితాలో రెండో స్థానంలో కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా నిలిచింది. కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమా యునానిమస్ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోగా ఈ సినిమా విడుదలైన నెల రోజులకే ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ ఛాప్టర్2 రెండో స్థానంలో నిలవడంలో ఆశ్చర్యం లేకపోయినా కేజీఎఫ్ ఛాప్టర్1 మూడో స్థానంలో నిలవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.

చాలా సంవత్సరాల నుంచి అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉన్న ఈ సినిమా కేజీఎఫ్ ఛాప్టర్2 వల్లే ఈ రేర్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. కేజీఎఫ్ ఛాప్టర్2 సినిమాను చూసిన ప్రేక్షకులు కేజీఎఫ్ ఛాప్టర్1 సినిమాను కూడా చూశారు. సీతారామం, పొన్నియిన్ సెల్వన్ పార్ట్1 సినిమాలు టాప్4, టాప్5 స్థానాలలో నిలిచాయి. విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు ఓటీటీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నాయి.

బచ్చన్ పాండే, జూగ్ జూగ్ జియో, రన్వే 34, జురాసిక్ వరల్డ్ డొమినియం, గెహారియా సినిమాలు తర్వాత స్థానాలలో నిలిచాయి. టాప్ 10 సినిమాలలో టాప్5 సినిమాలు సౌత్ సినిమాలే కావడం గమనార్హం. థియేటర్లలోనే కాదు ఓటీటీలో కూడా సౌత్ సినిమాల హవా కొనసాగుతోంది. రాబోయే రోజుల్లో కూడా ఓటీటీలో సౌత్ సినిమాల హవా కొనసాగుతుందేమో చూడాల్సి ఉంది.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus