Telugu Indian Idol: ఆహా సింగింగ్ షోలో అదరగొట్టిన టాప్ సింగర్లు వీళ్లే!

ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా ఓటీటీ ప్రతి శుక్రవారం కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేస్తూ సబ్ స్క్రైబర్ల సంఖ్యను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సినిమాల డిజిటల్ హక్కులను కొనుగోలు చేస్తూ ఆహా ఇతర ఓటీటీలకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం. గత కొన్ని వారాలుగా ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ షో పేరుతో మ్యూజిక్ కాంపిటీషన్ షో ప్రదర్శితమవుతోంది.

Click Here To Watch Now

టాలెంటెడ్ సింగర్లలో ఒకరైన శ్రీరామచంద్ర ఈ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్, స్టార్ హీరోయిన్ నిత్యామీనన్, కార్తీక్ ఈ షోకు జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. ఈ షోకు భారీస్థాయిలో ప్రేక్షకాదరణ దక్కుతోందని సమాచారం అందుతోంది. ఆహా ఓటీటీలో ఈ షో రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకుంటోందని తెలుస్తోంది. నిన్న రాత్రి ఈ సింగింగ్ షో థియేటర్ రౌండ్ ప్రసారం కాగా జడ్జీలు ప్రతిభ ఉన్న 12 మంది కంటెస్టెంట్లను తరువాత రౌండ్ కు ఎంపిక చేశారు.

ఈ షోలో గాయనీగాయకులు వినసొంపైన పాటలను పాడుతూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంటున్నారు. ఈ షో శుక్రవారం ఎపిసోడ్ లో వాగ్దేవి, శ్రీనివాస్ గోల్డెన్ మైక్ అందుకోగా శనివారం ఎపిసోడ్ లో లక్ష్మీ శ్రావణి, ప్రణతి గోల్డెన్ మైక్ ను అందుకున్నారు. తాజాగా ప్రసారమైన ఎపిసోడ్ లో తిరుపతికి చెందిన మాన్య శ్యామ్ సింగరాయ్ మూవీలోని ప్రణవాలయ పాటను బాగా పాడారు. వైష్ణవి సఖి సినిమాలోని స్నేహితుడా పాటను అద్భుతంగా పాడి మెప్పించారు. ఆట మూవీలోని యేలే యేలే పాటను లక్ష్మీ శ్రావణి అద్భుతంగా ఆలపించారు. జయంత్ గ్రీకువీరుడు సినిమాలోని ఓనాడు వాషింగ్ టన్ పాటను బాగా పాడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

తిరుపతికి చెందిన రేణు కృష్ణార్జున యుద్ధం మూవీలోని దారి చూడు పాటను బాగా పాడారు. ప్రణతి అతడు సినిమాలోని పిల్లగాలి అల్లరి పాటతో మెప్పించగా జస్కరన్ వకీల్ సాబ్ లోని మగువా మగువా పాటతో ఆకట్టుకున్నారు. ఈ షో తర్వాత ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కాగా రామ్ మిరియాల తర్వాత ఎపిసోడ్ కు గెస్ట్ గా హాజరయ్యారు. ప్రోమోలో రామ్ మిరియాల లాలా భీమ్లా పాట పాడగా ఈ ఎపిసోడ్ కోసం తెలుగు ఇండియన్ ఐడల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ టాప్ 12 కంటెస్టెంట్ల వివరాలు :

వాగ్దేవి – నెల్లూర్

అదితి భావరాజు – హైదరాబాద్

మారుతి కె – రాజన్న సిరిసిల్ల

లాలస – హైదరాబాద్

శ్రీనివాస్ – కడప

వైష్ణవి కొవ్వూరి – చెన్నై

చిట్టా లక్ష్మీ శ్రావణి – కొత్తగూడెం

బోడ జయంత్ మధుర్ – రామగుండం

సాకె రేణుకుమార్ – తిరుపతి

కె ప్రణతి – హైదరాబాద్

 

జస్కరన్ సింగ్ – పంజాబ్

ఎ మాన్యాచంద్రన్ – తిరుపతి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus