టాప్ 3 హీరోయిన్స్.. టాలీవుడ్ ని ఎలుతున్నారుగా..!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో కథానాయికల (Heroines) పోటీ ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉంటుంది. అయితే, ప్రస్తుతం ముగ్గురు స్టార్ హీరోయిన్స్ టాలీవుడ్‌ను పూర్తిగా డామినేట్ చేస్తున్నారు. రష్మిక మందన్న (Rashmika Mandanna) , శ్రీలీల (Sreeleela) , మీనాక్షి చౌదరి  (Meenakshi Chaudhary) ఈ ముగ్గురు తమ చక్కని నటనతో, గ్లామర్‌తో వరుస ఆఫర్లను దక్కించుకుంటున్నారు. ‘పుష్ప 2: ది రూల్’తో (Pushpa 2: The Rule)  నేషనల్ క్రష్‌గా పేరుపొందిన రష్మిక మందన్న ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో స్టార్‌గా వెలుగొందుతోంది.

Heroines

బాలీవుడ్‌లో ‘సికందర్’ (Sikandar) , ‘ఛావా’ (Chhaava) , ‘థమా’ వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు, తెలుగులో శేఖర్ కమ్ముల (Sekhar Kammula) దర్శకత్వంలో ‘కుబేర’  (Kubera)  చేయబోతోంది. అలాగే రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో నటిస్తోంది. రష్మిక చేతిలో ప్రస్తుతం ఎనిమిదికి పైగా ప్రాజెక్ట్స్ ఉండటంతో, ఆమె హవా ఇంకా కొనసాగనుందని అనిపిస్తోంది. ఇక నెక్స్ట్ రాబోయే సినిమాలకు ఆమె రెమ్యునరేషన్ 2 కోట్లకు పైనే ఉంటుందని టాక్.

ఇదే సమయంలో శ్రీలీల తన ఫుల్ స్పీడ్‌ను కొనసాగిస్తోంది. ఇటీవల పుష్ప 2లో ‘కిస్సిక్’ పాటతో అలరించిన శ్రీలీల, రవితేజ (Ravi Teja) సరసన ‘మాస్ జాతర’ (Mass Jathara), అఖిల్‌తో (Akhil Akkineni) ‘Akhil 6’, నాగచైతన్యతో  (Naga Chaitanya)  ‘NC 24’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్‌తో (Pawan Kalyan)  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh), సిద్ధూ జొన్నలగడ్డతో (Siddu Jonnalagadda) ఓ చిత్రంలో కూడా నటించనుంది. తమిళంలో శివ కార్తికేయన్ (Sivakarthikeyan)  సరసన ‘SK 25’ ద్వారా తమిళంలో అడుగుపెట్టబోతోంది.

మరోవైపు, మీనాక్షి చౌదరి టాలీవుడ్‌ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా అవతరించింది. ‘గుంటూరు కారం’ (Guntur Kaaram), ‘ది గోట్'(The Greatest of All Time), ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar)  వంటి హిట్ చిత్రాలతో బిజీగా ఉన్న మీనాక్షి, వెంకటేష్‌ (Venkatesh) ప్రధాన పాత్రలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunnam) చిత్రంలో కనిపించనుంది. ఆమెకు టాలీవుడ్‌లో ఇంకా రెండు ప్రాజెక్ట్స్ ఫైనలైజ్ కాగా, తమిళ సినిమాల వైపు కూడా అడుగులు వేస్తోంది.

ఈ ముగ్గురు హీరోయిన్స్ వరుసగా భారీ ప్రాజెక్ట్స్‌ చేస్తున్నందున, 2025లో కూడా వీరి హవా కొనసాగడం ఖాయం. టాలీవుడ్‌లో కొత్త హీరోయిన్స్‌ ఎంట్రీ ఇచ్చినా, ఈ ముగ్గురు తమ గ్లామర్, టాలెంట్‌తో ప్రేక్షకుల హృదయాలను కట్టిపడేస్తున్నారు. ఈ ముగ్గురు అందాల రాశులకు పోటీగా మరెవరు రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

మెగా హీరోలంతా మరోసారి ఒకే స్టేజ్ పై కనిపించనున్నారా!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus