కె.జి.ఎఫ్ కి అక్కడ ఘోర అవమానం.. ఏమైందంటే..!

కె. జి.ఎఫ్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాప్టర్ వన్ .. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ సాధించింది. నార్త్ లో ఆ మూవీ షారుఖ్ ఖాన్ జీరో సినిమాతో పాటు రిలీజ్ అక్కడ ఘనవిజయం సాధించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక చాప్టర్ 2 అయితే హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి భయపడేలా చేసింది అని చెప్పాలి. అంతేకాదు అక్కడ ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ ను కూడా అధిగమించింది.

ఇక తాజాగా కే. జి.చాప్టర్ 2 చిత్రం జపాన్ లో కూడా రిలీజ్ అయ్యింది. వాస్తవానికి జపాన్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని తెలిసినప్పటి నుండీ .. ఈ సినిమా అక్కడ ఆర్.ఆర్.ఆర్ కలెక్షన్స్ ను అధిగమించడం ఖాయం అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిదేమీ జరగలేదు. ఆర్.ఆర్.ఆర్ ను కాదు కదా కనీసం ఈ సినిమా రంగస్థలం కలెక్షన్స్ ను కూడా మ్యాచ్ చేయలేకపోయింది.

రంగస్థలం చిత్రం అక్కడ ఫస్ట్ వీకెండ్ ముగిసేసరికి రూ.59.7 లక్షలు కలెక్ట్ చేయగా , కే.జి.ఎఫ్ చాప్టర్ 2 కేవలం రూ.30.6 లక్షలు వసూలు చేసింది. ఇక కే.జి.ఎఫ్ చాప్టర్ వన్ కి అయితే మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.34.5 లక్షలు వసూలు చేసింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రం ఇప్పటికీ అక్కడ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఆ సినిమా అక్కడ టాప్ 25 లో ఉంది. కె.జి.ఎఫ్ చాప్టర్ వన్, చాప్టర్ 2 చిత్రాలు ఒక్కటి కూడా టాప్ 25 లో నిలవలేదు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో సందడి చేయబోతున్న 19 సినిమాలు/ సిరీస్ లు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus