తెలుగులో భారీ బడ్జెట్ పెట్టిన తీసిన టాప్ 5సాంగ్స్ ఇవే..!

సాధారణంగా సినిమాలలో పాటలను చిత్రీకరించడం కోసం కొన్ని సార్లు ఇతర దేశాలకు లేదా ఇతర ప్రదేశాలకు వెళ్తూ ఉంటారు. ఇంకొన్నిసార్లు భారీగా సెట్ వేసి అందులోనే డాన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే ఎక్కువ శాతం సినిమాలలో పాటలను చిత్రీకరించడం కోసం భారీగా కోట్లు పెట్టుబడి పెట్టి మరీ సెట్లు వేస్తూ ఉంటారు.కొన్ని కొన్ని పాటలకు మాత్రమే అందమైన ప్రకృతి ఎక్కడ ఉంటే అక్కడ చిత్రీకరిస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ లో కూడా సినిమాలలో పాటలను చిత్రీకరించడం కోసం ఏకంగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టారట.

అటువంటి వాటిలో టాలీవుడ్లో టాప్ 5 లో భారీ బడ్జెట్ తో చిత్రీకరించిన పాటలు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో టాప్ 5 లో ఉన్న పాట అలా వైకుంఠపురంలో సినిమాలోని రాములో రాముల పాట. ఈ పాటని తమన్ కంపోస్ట్ చేయగా ఈ పాట కోసం సెట్, విజువల్స్ కోసం ప్రొడ్యూసర్ లు ఏకంగా రూ.1.2 కోట్లు ఖర్చు చేశారట. ఇక ఈ లిస్టులో నాలుగవ స్థానంలో నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో ఇరగ ఇరగ సాంగ్ ను చిత్రీకరించడానికి రూ.1.5 కోట్లు ఖర్చు చేశారట.

అలాగే రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మ మంగమ్మ అనే పాటను చిత్రీకరించడానికి రెండు కోట్ల రూపాయలు ఖర్చు చేశారట.ఇక రెండవ పాట మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమాలో వచ్చాడయ్యో స్వామి పాటకు ఏకంగా 2.5 కోట్లు ఖర్చు పెట్టారట. ఈ పాటలోని బ్యాక్గ్రౌండ్ సెట్స్ అలాగే పాటలో కొన్ని వందల మంది డాన్సర్లతో కలిపి ఈ పాటను భారీ బడ్జెట్ తో చిత్రీకరించారట.

ఇక టాప్ వన్ సాంగ్ బాహుబలి సినిమాలోని సాహోరే బాహుబలి సాంగ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే భారీ బడ్జెట్ తో నిర్మించిన వాటిలో టాప్ వన్ లో ఉంది.ఈ సినిమాలో కీరవాణి కంపోస్ట్ చేసిన ఆ పాట కోసం ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట.వందలాది మంది డాన్సర్లతో ఈ పాటను చాలా గ్రాండ్గా చిత్రీకరించారు. ఇటీవల రీలీజ్ కు సిద్దమైన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో జరగండి అనే సాంగ్ కోసం ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేసినట్లు ఇండస్ట్రీ టాక్.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus