టాలీవుడ్ నయా విలన్లు

  • January 19, 2017 / 08:08 AM IST

తెలుగు చిత్ర పరిశ్రమ మొదలైన రోజుల్లో రాజనాల, నాగభూషణం, సత్యనారాయణ లు క్రూరంగా నటించి ప్రేక్షకులను భయపెట్టించారు. ఆ తర్వాత రావు గోపాల రావు, కోట శ్రీనివాస రావు, రామిరెడ్డి, ప్రకాష్ రాజ్ తదితరులు విలనిజంతో చెమటలు పట్టించారు. ప్రస్తుతం కుర్ర హీరోలతో కొత్త విలన్లు సై అంటున్నారు. నటనలోనూ, స్టయిల్ లోను హీరోలకు పోటీ పడుతూ పేరు తెచ్చుకుంటున్నారు.

కబీర్ దుహాన్ సింగ్హర్యానాకు చెందిన నటుడు కబీర్ దుహాన్ సింగ్. సినీ రంగం మీద ప్రేమతో ముంబైలో అడుగుపెట్టాడు. అవకాశాలకోసం తిరుగుతున్న కబీర్ ని టాలీవుడ్ ఆహ్వానించింది. “జిల్” సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమై నటనతో హడలెత్తించాడు. వరుసగా కిక్ 2, కృష్ణాష్టమి, డిక్టేటర్, తుంటరి, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాల్లో అవకాశం దక్కించుకున్నాడు.

సంపత్ రాజ్తెలుగువాడైన సంపత్ రాజ్ తమిళంలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. నెల్లూరులో పుట్టి పెరిగిన సంపత్ చెన్నై వెళ్లి అనేక సినిమాలు చేశారు. తెలుగులో తొలిసారి పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో నటించారు. ఆ తర్వాత దమ్ము సినిమాలోనూ కనిపించారు. కానీ “మిర్చి”తో సంపత్ రాజ్ కి టాలీవుడ్ లో బ్రేక్ వచ్చింది. రన్ రాజారన్, పవర్, శ్రీమంతుడు సినిమాల్లో విభిన్నమైన నటనతో తెలుగు వారిని మెప్పించారు.

శత్రుపుట్టింది, పెరిగింది ఒరిస్సా లో అయినా, మాతృభాష తెలుగు కావడంతో శత్రు కాలేజ్ చదువుకోసం హైదరాబాద్ కి వచ్చాడు. నటనపై ఇష్టంతో పలు సినీ నిర్మాణ సంస్థలకు ఫోటోలు పంపిస్తే “లెజెండ్”లో రోల్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత ఆగడు, కృష్ణ గాడి వీర ప్రేమ గాధలో శత్రు విలన్ గా కిరాక్ పుట్టించాడు.

అర్జున్ విజయ్తమిళ ప్రముఖ నటుడు విజయ్ కుమార్ కుమారుడు అర్జున్ విజయ్. హీరో కొడుకు హీరోనే కావాలి అనే సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నెగటివ్ రోల్ లో తన టాలెంట్ ని ప్రదర్శించాడు. తమిళంలో 20 కి పైగా సినిమాలు చేసిన స్టార్ సన్ తెలుగులో బ్రూస్లీ చిత్రంలో యాక్టింగ్ ఇరగదీసాడు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పోటీ పడి నటించి శెభాష్ అనిపించుకున్నాడు.

నిఖిథిన్ ధీర్బాలీవుడ్ లో రెడీ, దబాంగ్, చెన్నై ఎక్స్ ప్రెస్ సినిమాల్లో ప్రతి కథానాయకుడిగా అరాచకం సృష్టించిన నిఖిథిన్ ధీర్ తెలుగు తెరపైన కూడా మంచి మార్కులు కొట్టేసాడు. కిక్ 2, కంచె సినిమాల్లో అద్భుత నటనతో అదరగొట్టాడు.

రవి కిషన్మద్దాలి శివా రెడ్డి అనే ఒకే పాత్రతో తెలుగు వారికి గుర్తుండి పోయిన నటుడు రవి కిషన్. ఈయన హిందీ, భోజ్ పురి భాషలో అనేక చిత్రాలు చేశారు. తొలిసారి తెలుగులో “రేసుగుర్రం” సినిమాలో విలన్ గా కేక పుట్టించాడు. తాజాగా వచ్చిన సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ మూవీలోనూ బీకు గా భలే నటించాడు.

హరీష్ ఉత్తమ్తమిళ సినిమాల్లో విలన్ గా పేరుగాంచిన చెన్నై కుర్రోడు హరీష్ ఉత్తమ్. తెలుగులో అల్లు శిరీష్ గౌరవం సినిమా ద్వారా పరిచయమయ్యాడు. సెకండ్ గ్రేడ్ విలన్ గా పవర్, కృష్ణ గాడి వీర ప్రేమ గాధ లో రచ్చ చేసాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus