రాజమౌళి టు ప్రశాంత్ నీల్ అత్యధిక పారితోషికం అందుకునే 10 మంది దర్శకుల లిస్ట్..!

  • June 1, 2022 / 02:29 PM IST

రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి స్టార్ డైరెక్టర్స్ కు హీరోల కంటే కూడా ఎక్కువ పారితోషికం ఇస్తారు అనే ప్రచారం ఉంది. ఒకవేళ అది నిజమైనా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే… ఇండియన్ బాక్సాఫీస్ పై దండయాత్ర చేసే సినిమాలను అందించారు మరి. ఇండియన్ సినిమా రూపు రేఖల్ని మార్చేశారు. ముఖ్యంగా ఈ దర్శకులు బాలీవుడ్ ను కూడా సైడ్ చేసేసే సినిమాలను అందించారు. సౌత్ సినిమా స్థాయి ఏంటనేది ప్రపంచానికి చాటి చెప్పారు. ఒకప్పుడు రూ.100 కోట్ల గ్రాస్ ను కొట్టడానికే లభో దిభో అనుకునే వారు. కానీ ఇప్పుడు రూ.1100 కోట్లు,రూ.1200 కోట్లు రూ.1800 కోట్లు అలా ఉంటుంది మన సౌత్ సినిమా లెక్క. సౌత్ లో ఇప్పుడు ఎక్కువ పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి అంటే అది ఇలాంటి దర్శకులు నింపిన స్ఫూర్తి అనే చెప్పాలి.

అలా అని మిగిలిన దర్శకులను తక్కువ చేయాల్సిన పని లేదు. వీళ్ళు ధైర్యంగా ముందడుగు వేస్తె మిగిలిన దర్శకులు కూడా వీరి బాటలో నడుస్తున్నారు. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమా గురించే చెప్పుకునే వారు. అలాంటి బాలీవుడ్ మేకర్స్ కూడా పాన్ ఇండియా సినిమాలు తీయడానికి సాహసించేవారు కాదు. రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా భన్సాలీ వంటి దర్శకులు బాలీవుడ్ వరకు మాత్రమే చూసుకునే. ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే బాలీవుడ్ హీరోలకి ఎక్కడైతే మార్కెట్ ఉందో అక్కడే తమ సినిమాలను విడుదల చేసుకునేలా ప్లాన్ చేసుకునేవారు. సౌత్ సినిమా మేకర్స్ ధైర్యం చేసి పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను రూపొందించడం మనం చూస్తున్నాం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే ఇండియన్ డైరెక్టర్స్ లో అత్యధిక పారితోషికం అలాగే లాభాల్లో వాటాలు అందుకునే 10 మంది ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1) రాజమౌళి :

ఈ లిస్ట్ లో డౌట్ లేకుండా ఈయన పేరు ముందొస్తుంది అని చాలా మంది ఊహించి ఉంటారు. ఈయన ఒక్కో సినిమాకి రూ.120 కోట్ల పారితోషికం మరియు లాభాల్లో వాటా రూపంలో మొత్తంగా రూ.150 కోట్లు అందుకుంటారు.

2) ప్రశాంత్ నీల్ :

‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ సినిమాకి గాను ఈయన రూ.80 కోట్లు పారితోషికం మరియు లాభాల్లో వాటాతో కలుపుకుని రూ.100 కోట్ల వరకు అందుకున్నారట.

3) రోహిత్ శెట్టి :

ఈ బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఒక్కో సినిమాకి రూ.40 కోట్ల పారితోషికం అలాగే లాభాల్లో వాటాతో కలుపుకుని రూ.50 కోట్ల వరకు తీసుకుంటారట.

4) రాజ్ కుమార్ హిరానీ :

ప్రపంచ వ్యాప్తంగా ఈయన సినిమాల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఈయన ఒక్కో సినిమాకి రూ.40 కోట్ల పైగా పారితోషికం అందుకుంటారు. కాకపోతే లేట్ గా సినిమాలు చేస్తుంటారు.

5) ఎ.ఆర్. మురుగదాస్ :

ఈయన ఒక్కో సినిమాకి రూ.30 కోట్లకి పైగా పారితోషికం అందుకుంటారు. అంతేకాకుండా అదనంగా లాభాల్లో వాటా కూడా తీసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈయన కథల విషయంలో వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటారు.

6) శంకర్ :

ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు శంకర్ రేసులో కాస్త వెనుక పడ్డారు. అయినప్పటికీ ఈయన రూ.35 కోట్లకి పైనే పారితోషికం అందుకుంటారట.

7) త్రివిక్రమ్ :

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పాన్ ఇండియా సినిమాలు తీయకపోయినా.. రూ.30 కోట్లకి పైనే పారితోషికం అందుకుంటారు. అంతేకాకుండా అదనంగా లాభాల్లో వాటా కూడా అందుకుంటారు. ఈయన ఎక్కువగా ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ లోనే సినిమాలు చేస్తున్నారు.

8) సుకుమార్ :

‘పుష్ప ది రైజ్’ చిత్రానికి గాను ఈయన రూ.30 కోట్ల వరకు పారితోషికం అందుకున్నారట. ‘పుష్ప2’ కి రూ.45 కోట్లు అలాగే లాభాల్లో వాటాతో కలుపుకుని రూ.60 కోట్ల వరకు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.

9) అట్లీ :

కోలీవుడ్ దర్శకుడు అట్లీ కూడా రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నాడట. టాలీవుడ్లో కూడా అట్లీ సినిమాలకి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఆయన బాలీవుడ్ పై కూడా ఫోకస్ పెట్టాడు.

10) కొరటాల శివ :

‘ఎన్టీఆర్ 30’ చిత్రానికి కొరటాల రూ.25 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారట. ‘ఆచార్య’ వల్ల ఈయన కూడా నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఇప్పటివరకు సంపాదించింది కూడా పోయింది. కాబట్టి.. ఇక ముందు ఈయన చేయబోయే సినిమాల్లో లాభాల్లో వాటా కూడా తీసుకోవాలని భావిస్తున్నారు.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus