సౌత్ సినిమాలకు గానూ… సైమా 8వ అవార్డుల వేడుకకు రంగం సిద్ధమైంది. ఆగష్టు 15, 16 వ తేదీలలో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ప్రముఖ ఫాంటలూన్స్ సంస్థ ఈ వేడుకని స్పాన్సర్ చేస్తుంది. దీనికి సంబందించిన వివరాలను తెలియజేయడానికి ఫాంటలూన్స్ సంస్థ ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసింది. ఈ ప్రెస్ మీట్లో శ్రీయ శరన్. సుధీర్ బాబు, రుహాని శర్మ, నిధి అగర్వాల్, ఫాంటలూన్స్ మార్కెటింగ్ హెడ్ ర్యాన్ వంటి వారు పాల్గొన్నారు. ‘2018’ సైమా అవార్డ్స్ కు నామినేట్ అయిన చిత్రాల మధ్య మంచి పోటీ నెలకొంది.
టాలీవుడ్లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ చిత్రం టాప్ లో ఉండగా ‘మహానటి’ చిత్రం కూడా గట్టి పోటీ ఇస్తుండడం విశేషం. ఇక తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష ల ’96’. కన్నడలో ‘కేజీఎఫ్ చాప్టర్1’ చిత్రాలు అగ్రస్థానంలో ఉన్నాయి.
‘సైమా అవార్డ్స్’ నామినేషన్స్ లిస్ట్:
తెలుగులో టాప్ నామినేషన్స్
1. రంగస్థలం: 12 నామినేషన్స్

2. మహానటి: 9 నామినేషన్స్

3. గీత గోవిందం: 8 నామినేషన్స్

4. అరవింద సమేత: 6 నామినేషన్స్

తమిళంలో టాప్ నామినేషన్స్
1. 96: 10 నామినేషన్స్

2. కోలమావు కోకిల: 7 నామినేషన్స్

3. వడ చెన్నై: 6 నామినేషన్స్

మలయాళంలో టాప్ నామినేషన్స్
1. సుదాని ఫ్రం నైజీరియా: 9 నామినేషన్స్

2. వరదన్: 6 నామినేషన్స్

3. అరవిందంటె అదితికల్: 5 నామినేషన్స్

4. పూమరం:

కన్నడ టాప్ నామినేషన్స్
1. కేజీఎఫ్ చాప్టర్ 1: 12 నామినేషన్స్

2. తగరు: 11 నామినేషన్స్

3. సర్కారి హి. ప్ర. షాలే, కాసరగోడు, కొడుగె: రామన్న రాయి 10 నామినేషన్స్

ఈ ఏడాది కూడా షార్ట్ ఫిల్మ్స్ అవార్డులను సైమా హోస్ట్ చేస్తోంది.
