గతేడాది “శతమానం భవతి, నేను లోకల్, ఫిదా, దువ్వాడ జగన్నాధం, రాజా ది గ్రేట్, మిడిల్ క్లాస్ అబ్బాయి” చిత్రాలతో నిర్మాతగా వరుసగా ఆరు విజయాలు అందుకొన్న దిల్ రాజుకు ఈ ఏడాది మాత్రం పెద్దగా అచ్చోచ్చినట్లు కనిపించడం లేదు. ఎందుకంటే.. దిల్ రాజు అవుట్ రైట్ గా కొని డిస్ట్రిబ్యూట్ చేసిన “కృష్ణార్జున యుద్ధం” ఫ్లాపై భారీ నష్టం తెచ్చిపెట్టింది. ఆ తర్వాత నైజాం లో డిస్ట్రిబ్యూట్ చేసిన “నా పేరు సూర్య” సినిమా వల్ల కూడా కాస్త గట్టిగా లాస్ వచ్చింది దిల్ రాజుకి.
ఇక ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా విడుదల చేసిన పూరీ జగన్నాధ్ “మెహబూబా” చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో ఈ సినిమాకి పెట్టిన ఖర్చులో సగం కూడా వెనక్కి వచ్చే అవకాశాలు కనపడడం లేదు. ఈ విధంగా రెండు నెలల్లో మూడు ఫ్లాప్స్ దక్కించుకొని డిస్ట్రిబ్యూటర్ గా హ్యాట్రిక్ ఫ్లాప్ అందుకొన్నాడు దిల్ రాజు. మరి ఈ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకొని దిల్ రాజు తాను నిర్మిస్తున్న చిత్రాలతోనైనా లాభాలబాట పడతాడేమో చూడాలి.