బుక్ మై షో ట్రాప్‌లో ఇండస్ట్రీ? నిజంగానే గేమ్ మానిపులేట్ అవుతోందా?

సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్, పాటలు ఎంత హైప్ క్రియేట్ చేసినా, ఈ రోజుల్లో ఒకటే ఫలితం నిర్ణయిస్తున్నది కొందరి వాదన.. అదే బుక్ మై షో! (BookMyShow ) ‘ఇంటరెస్టింగ్’ కౌంట్ ఎక్కువ అంటే హిట్, తక్కువ అంటే ఫ్లాప్ అని తేల్చేసే టైమ్ ఇది. అయితే ఇది సహజంగా జరిగిందా? లేక ఎక్కడైనా మేనిప్యులేషన్ జరిగిందా? అన్న డౌట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీని గట్టిగానే చుట్టేస్తోంది. ముఖ్యంగా మిడిల్ రేంజ్, కంటెంట్ బేస్డ్ సినిమాలు డిజర్వ్ చేసిన స్పందన రాకపోవడంతో నిర్మాతల్లో అసంతృప్తి బలంగా వ్యక్తమవుతోంది.

BookMyShow

బుక్ మై షో యాప్‌లోని ఓటింగ్, ఇంటరెస్ట్ ఫీచర్స్‌పై వస్తున్న ఆరోపణల ప్రకారం బాట్స్ ద్వారా లైక్స్, కౌంట్స్ క్రియేట్ చేస్తున్నారని కామెంట్స్ వస్తున్నాయి. టికెట్ బుక్ చేయని యూజర్లు కూడా ఓటింగ్ చేయగలగడం వలన నిజమైన ఆడియన్స్ స్పందన తిరగబడి, ఫేక్ ట్రెండ్‌లు కనిపిస్తున్నాయని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. నిర్మాతలు ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నా, గిల్డ్‌లో ఉన్న పెద్ద నిర్మాతల మౌనం మరింత అనుమానాల‌కు దారితీస్తోంది. వాస్తవానికి బుక్ మై షో ఇండస్ట్రీలో పలు మల్టీప్లెక్స్‌లు, థియేటర్లలో డైరెక్ట్ షేర్లు ఉన్నట్టు సమాచారం.

అంతేకాదు, కొందరు నిర్మాతలకు బుక్ మై షో నుంచే పెట్టుబడులు వచ్చినట్టు ఇండస్ట్రీలో గట్టిగానే చర్చ సాగుతోంది. ఇది నిజమైతే, ఈ యాప్‌పై బహిరంగంగా స్పందించడం కొందరికి డేంజర్ అలెర్ట్‌గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇటీవల ఓ స్టార్ హీరో నిర్మాణంలో ఉన్న మల్టీప్లెక్స్ ప్రాజెక్ట్‌లో బుక్మైషో రూ.20 కోట్లు ఇన్వెస్ట్ చేసిందన్న టాక్ సీరియస్ డిస్కషన్‌కి దారి తీసింది. ఇక ఈ మొత్తం వ్యవహారంపై నిర్మాతల గిల్డ్ నుంచి అధికారికంగా ఎటువంటి స్పందన రాకపోవడం అసలు సమస్యగా మారింది.

నాగా వంశీ (Suryadevara Naga Vamsi ) లాంటి కొద్దిమంది మాత్రమే వాక్‌ఔట్ చేసినట్టు తెలుస్తున్నా, మిగిలిన వారంతా బుక్ మై షో (BookMyShow ) పని తీరుపై దృష్టి పెట్టడం లేదు. ఇది ఇండస్ట్రీలో ఉన్న ఆధిపత్య వ్యవస్థను సూచిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. సామాన్య ప్రేక్షకుడి కోసం ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ అనేది సులభతరం చేసినా, అదే వ్యవస్థ ఇప్పుడు సినిమాల ఫలితాలను ప్రభావితం చేసే మాదిరిగా మారడం ఆరోగ్యకరమైన పరిణామం కాదని పరిశ్రమ వర్గాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇప్పుడైనా నిర్మాతల గిల్డ్ అధికారంగా ఈ వ్యవహారంపై లోతుగా విచారణ జరిపి, సరైన మార్గదర్శకాలు తీసుకురావాలని ఒత్తిడి పెరుగుతోంది.

‘ఊపిరి’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus