యూట్యూబ్‌లో ఈ ఏడాది అదరగొట్టిన పాటలు ఇవే!

మరో మూడు వారాల్లో 2022 ముగిసిపోనుంది. దీంతో ప్రతి రంగంలోనూ రివైండ్‌లు మొదలయ్యాయి. ఈ క్రమంలో యూట్యూబ్‌లోనూ రివైండ్‌ స్టార్ట్‌ చేశారు. ఈ ఏడాది కాలంలో ట్రెండింగ్‌లో ఉన్న టాప్‌ సాంగ్స్‌ ఏవీ అనే లిస్ట్‌ను రిలీజ్‌ చేసింది. అందులో అల్లు అర్జున్‌, విజయ్‌దే హవా అని చెప్పొచ్చు. మొత్తం పది పాటల్లో ఐదు పాటలు ఈ హీరోలవే కనిపిస్తున్నాయి. మొదటి స్థానం ‘పుష్ప: ది రైజ్‌’ది అయితే.. ఆఖరి పాట ‘కేసరిలాల్‌’ అనే ఆల్బమ్‌ది. మొత్తం టాప్‌ 10 లిస్ట్‌.. ఆ పాటలు చూసేయండి.

1. ‘శ్రీవల్లి…’, చిత్రం: పుష్ప: ది రైజ్‌

2. ‘అరబిక్‌ కుత్తు…’ (లిరికల్‌ వీడియో), చిత్రం: బీస్ట్‌

3. ‘సామి సామి…’, చిత్రం: పుష్ప: ది రైజ్‌

4. ‘కచ్చా బాదం…’, ఆల్బమ్‌: కచ్చా బాదం

5. ‘లే లే ఆయీ కోక కోలా…’, ఆల్బమ్‌: లే లే ఆయీ కోక కోలా

6. ‘ఊ.. బోల్‌ గయా ఊహూ బోల్‌ గయా…’ చిత్రం: పుష్ప: ది రైజ్‌ (హిందీ)

7. ‘ఊ.. అంటావా మావ ఊహూ అంటావా…’ చిత్రం: పుష్ప: ది రైజ్‌

8. ‘కోక్‌ స్టూడియో’, ఆల్బమ్‌: కోక్‌ స్టూడియో సీజన్‌ – 14

9. ‘అరబిక్‌ కుత్తు…’ (వీడియో సాంగ్), చిత్రం: బీస్ట్‌ (తమిళం)

10. ‘కేసరి లాల్‌..’ న్యూ సాంగ్‌

మొత్తంగా చూస్తే ‘పుష్ప: ది రైజ్‌’ సినిమాకు నాలుగు పురస్కారాలు దక్కాయి. అందులో మూడు పాటలు తెలుగు నుండి అయితే, ఒక పాట హిందీ నుండి. ‘బీస్ట్‌’ సినిమా నుండి రెండు పాటలు వచ్చాయి. రెండూ ‘అరబిక్‌ కుత్తు..’నే. ఒకటి లిరికల్‌ సాంగ్‌ కాగా, రెండోది ఫుల్‌ వీడియో సాంగ్‌. ఆ లెక్కనే బన్నీ, విజయ్‌దే ఈ ఏడాది యూట్యూబ్‌లో సందడి. టాప్‌ 10 ఈ సినిమాలు కాకుండా మిగిలినవన్నీ ఆల్బమ్‌ సాంగ్సే. అందులో ‘కచ్చా బాదం..’ సాంగ్‌ అదిరిపోయిందని చెప్పాలి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus