Rajamouli: రాజమౌళికి పోటీ పెరిగిందిగా.. ఏం చేస్తారో?

దర్శకధీరుడు రాజమౌళి ఏ సినిమాను తెరకెక్కించినా ఆ సినిమా కోసం రేయింబవళ్లు తెగ కష్టపడుతున్నారు. ఒక్కో సినిమా కోసం రెండు నుంచి మూడేళ్ల సమయం కేటాయిస్తున్న జక్కన్న ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం సాధిస్తున్నారు. తనపై వస్తున్న నెగిటివ్ కామెంట్లను రాజమౌళి దృష్టిలో పెట్టుకుని క్రిటిక్స్ ను సైతం మెప్పించే సినిమాలను తెరకెక్కిస్తూ ఉండటం గమనార్హం. జక్కన్న సినిమా అంటే 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే ఈ దర్శకునికి ప్రస్తుతం ఊహించని స్థాయిలో పోటీ పెరుగుతోంది. కన్నడలో ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి ఈ దర్శకునికి గట్టి పోటీ ఇస్తున్నారు. కేజీఎఫ్2 సినిమా 100 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కితే కాంతార సినిమా 16 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసిన అద్భుతాలు అన్నీఇన్నీ కావు. ఈ ఇద్దరు డైరెక్టర్ల భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

తమిళం నుంచి రాజమౌళికి శంకర్, లోకేశ్ కనగరాజ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఈ మధ్య కాలంలో శంకర్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయకపోయినా చరణ్ సినిమాతో శంకర్ కు పూర్వ వైభవం వస్తుందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. లోకేశ్ కనగరాజ్ ఖైదీ, విక్రమ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోగా ఈ డైరెక్టర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మలయాళంలో జీతూ జోసెఫ్ విభిన్నమైన సినిమాలు తెరకెక్కిస్తున్నా ఈ దర్శకుడు కూడా రాజమౌళికి గట్టి పోటీ అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి కంటే పైచేయి సాధించే డైరెక్టర్ ఎవరనే చర్చ జరుగుతోంది. రాజమౌళి రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి జక్కన్న ఎదిగారు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus