Ravi Teja, Nikhil: సక్సెస్ సెంటిమెంట్ ను నిఖిల్ రిపీట్ చేస్తారా?

2023 సంక్రాంతి పండుగకు భారీ స్థాయిలో పోటీ ఉందనే సంగతి తెలిసిందే. అందువల్ల చాలామంది హీరోలు తమ సినిమాలను సంక్రాంతికి రెండు వారాల ముందు లేక సంక్రాంతి తర్వాత రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. వాస్తవానికి ఈ ఏడాది డిసెంబర్ నెల 23వ తేదీన ఖుషి సినిమాను విడుదల చేయాలని మేకర్స్ అనుకున్నారు. అయితే షూటింగ్ ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా ఆ తేదీకి రిలీజ్ కావడం లేదు. అయితే ఆ తేదీన రవితేజ నటించిన ధమాకా, నిఖిల్ నటించిన 18 పేజెస్ సినిమాలు రిలీజ్ కానున్నాయి.

నిఖిల్ కెరీర్ తొలినాళ్లలో రవితేజను ఇమిటేట్ చేసేవారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే ఆ తర్వాత నిఖిల్ విమర్శలను దృష్టిలో ఉంచుకుని యాక్టింగ్ విషయంలో మారారు. ఈ ఏడాది రవితేజ నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు థియేటర్లలో విడుదలై డిజాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయి. ధమాకా సినిమాతో అయినా నిఖిల్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరోవైపు కార్తికేయ2 సక్సెస్ తో నిఖిల్ మార్కెట్ పెరిగింది. 18 పేజెస్ సినిమాతో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని నిఖిల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

రవితేజ, నిఖిల్ లలో పైచేయి సాధించే హీరో ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందేనని చెప్పవచ్చు. డిసెంబర్ 23వ తేదీన మరికొన్ని తమిళ సినిమాలు సైతం థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. డిసెంబర్ నెల వరకు క్రేజ్ ఉన్న సినిమాలేవీ థియేటర్లలో రిలీజయ్యే అవకాశం లేకపోవడంతో ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ ఏడాది రిలీజైన సినిమాలలో చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే. డిసెంబర్ లో రిలీజయ్యే సినిమాలు అయినా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తాయేమో చూడాల్సి ఉంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus