Jr NTR, Ram Charan: వైరల్ అవుతున్న టోవినో థామస్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆర్ఆర్ఆర్ సినిమాతో ఓవర్ నైట్ లో చరణ్, తారక్ గ్లోబల్ స్టార్స్ గా గుర్తింపును సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే. చరణ్, తారక్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. ఇతర ఇండస్ట్రీలలో కూడా చరణ్, తారక్ లకు రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటం గమనార్హం. 2018 మూవీ సక్సెస్ మీట్ లో టోవినో థామస్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.

కాలేజ్ లో చదువుకునే సమయంలో రామోజీ ఫిల్మ్ సిటీ కోసం టూర్ కు వచ్చానని ఆయన తెలిపారు. యాక్టర్ అయిన తర్వాత పలు అవార్డుల కార్యక్రమాల కోసం హైదరాబాద్ కు వచ్చానని టోవినో థామస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా ప్రమోషన్ కోసం మొదటిసారి హైదరాబాద్ కు రావడం సంతోషాన్ని కలిగించిందని టోవినో థామస్ కామెంట్లు చేశారు. నేను నటించిన సినిమాలను తెలుగులోకి డబ్ చేయాలని చాలామంది కోరారని ఆయన అన్నారు.

2018 వరదలు మాకు పీడకల అని ఆ పీడకలను డ్రీమ్ ప్రాజెక్ట్ గా భావించి కష్టపడి ఈ సినిమాను తెరకెక్కించడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ సినిమాకు రిలీజైన ప్రతి చోట మంచి రెస్పాన్స్ లభించిందని టోవినో థామస్ కామెంట్లు చేశారు. ఈ మూవీలోని కొన్ని సన్నివేశాలు షూట్ చేస్తున్న సమయంలో అప్పటిరోజులు గుర్తుకొచ్చాయని టోవినో థామస్ అభిప్రాయపడ్డారు.

(Jr NTR) ఎన్టీఆర్, రామ్ చరణ్ అంటే నాకెంతో ఇష్టమని ఇతర భాషల హీరోలతో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని టోవినో థామస్ అన్నారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో పని చేసే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తానని ఆయన తెలిపారు. తారక్, చరణ్ లకు ఇతర భాషల్లో సైతం క్రేజ్ ఉండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. చరణ్, తారక్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు భావిస్తున్నారు.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus