‘అరణ్య’ పరిస్థితి ఇలా అయిందేంటి..?

వీకెండ్ పూర్తయ్యేసరికి శుక్రవారం విడుదలైన సినిమాల జాతకాలు బయటపడ్డాయి. నితిన్-కీర్తి సురేష్ నటించిన ‘రంగ్ దే’ సినిమాకి వీకెండ్ లో మంచి కలెక్షన్స్ వచ్చాయి. ఫస్ట్ వీకెండ్ ఈ సినిమాకు ఏపీ,నైజాంలో రూ.10 కోట్ల 35 లక్షల షేర్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే.. అటుఇటుగా రూ.13 కోట్లు సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో రూ.11 కోట్లు వసూళ్లు రావాలి. ఈ సినిమా సంగతి పక్కన పెడితే.. రానా నటించిన ‘అరణ్య’ సినిమాకి డిజాస్టర్ టాక్ వచ్చింది.

డాక్యుమెంటరీ మాదిరి సినిమా ఉందని.. రిలీజ్ రోజే సినిమాకి నెగెటివ్ టాక్ వచ్చింది. రెండో రోజు చాలా ఏరియాల్లో ప్రేక్షకులు రాక.. ఈ సినిమా షోలను రద్దు చేశారు. ఆదివారం నాడు ఓ మోస్తరు ఆక్యుపెన్సీ కనిపించినప్పటికీ సినిమా పుంజుకోవడానికి అతి ఎంతమాత్రం సరిపోదు. ఓవరాల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ ఈ సినిమాకి కేవలం రెండున్నర కోట్ల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. మొదటి వీకెండ్ లో రెండున్నర కోట్లు అంటే..

ఇక ఈ వీకెండ్ నాటికి సినిమా థియేటర్ల నుండి వెళ్లిపోవడం ఖాయమనిపిస్తుంది. ‘రంగ్ దే’, అరణ్య’లతో పాటు ‘తెల్లవారితే గురువారం’ అనే మరో సినిమా కూడా వచ్చింది. కానీ ఈ సినిమా రెండో రోజే నిలవలేకపోయింది. కీరవాణి కొడుకు శ్రీసింహా నటించిన ఈ సినిమాకి తొలిరోజే డిజాస్టర్ టాక్ వచ్చింది. ఆదివారం కూడా ఈ సినిమా థియేటర్లలో జనాలు లేరు. ఈరోజు నుండి చాలా ఏరియాల్లో ఈ సినిమా తీసేయబోతున్నారు.

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus