యంగ్ టైగర్ ఎన్టీఆర్ కారును హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్డుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.ఆదివారం నాడు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద ఎన్టీఆర్ కారును ఆపి తనిఖీలు నిర్వహించారు పోలీసులు. ఈ క్రమంలో ఎన్టీఆర్ కారు అద్దాలకు ఉన్న బ్లాక్ ఫిలిం స్క్రీన్ ను కూడా వారు తొలగించడం జరిగింది. దీని పై చాలా సేపు రచ్చ జరిగింది. వై కాటగిరి భద్రత ఉన్న వ్యక్తులు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అర్హులు.
Click Here To Watch NEW Trailer
మిగతా వారు ఉపయోగించకూడదని సుప్రీం కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి కార్లు ఎక్కడ కనిపించినా వారు ఉపేక్షించకుండా సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఆ స్క్రీన్ పై ఉన్న బ్లాక్ ఫిలింని తొలగించిన తర్వాత ఎన్టీఆర్ కారుకి రూ.700 జరిమానా కూడా విధించారు. ఇక ఎన్టీఆర్ కారుని పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ లేరు.డ్రైవర్, ఎన్టీఆర్ తనయుడు మరియు ఇంకో వ్యక్తి ఉన్నట్టు తెలుస్తుంది.
మరోపక్క ఎన్టీఆర్ ‘ఆర్.ఆర్.ఆర్’ ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నాడు. చరణ్, రాజమౌళిలతో పాటు ఎన్టీఆర్ చేస్తున్న కామెడీ తరచూ చూస్తూనే వస్తున్నాం. ఇక ‘ఆర్.ఆర్.ఆర్’ అడ్వాన్స్ బుకింగ్ల జోరు కూడా ఊపందుకుంది. ఇప్పటికే మొదటి రోజు టికెట్లు చాలా వరకు బుక్ అయిపోయాయి. టికెట్ రేట్ రూ.400 వరకు ఉన్నప్పటికీ ఎవ్వరూ తగ్గడం లేదు.
Most Recommended Video
ఒకే ఫ్యామిలీలో రెండు జెనెరేషన్స్ కు చెందిన హీరోలతో జోడీ కట్టిన భామల లిస్ట్..!
‘గాడ్ ఫాదర్’ తో పాటు టాలీవుడ్లో రీమేక్ కాబోతున్న 10 మలయాళం సినిమాలు..!
ఈ 10 సినిమాలు తెలుగులోకి డబ్ అయ్యాక కూడా రీమేక్ అయ్యాయని మీకు తెలుసా..!