విషాదంలో టాలీవుడ్ హీరోయిన్.. కోలుకోలేని దెబ్బ!

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న నందిత శ్వేతా ఒక చేదు విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో ఆనందకరమైన విషయాలను షేర్ చేసుకునే ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ చాలా కాలం తరువాత తనకు ప్రాణమైన వ్యక్తిని కోల్పోయినట్లు సోషల్ మీడియాలో పేర్కొంది.

తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో ఈరోజు కన్నుమూసినట్లు ఆమె శ్రేయోభిలాషులందరికీ తెలియజేసింది. తండ్రి ఆత్మకు శాంతి కలుగుగాక అని నందిత ఎమోషనల్ గా వివరణ ఇవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇండస్ట్రీ ప్రముఖులు కూడా నందిత బాధతో చేసిన ట్వీట్ కు స్పందిస్తున్నారు. నందిత శ్వేత క్లోజ్ ఫ్రెండ్ నటి ఐశ్వర్య రాజేష్ కూడా.. క్షమించండి నందిత అంటూ ఆయన దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు.

ఇతర సినీ ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఇక తమిళ్ లో 2012 నుంచి బిజీ హీరోయిన్ గా కొనసాగుతున్న నందిత తెలుగులో ఎక్కడికి పోతావు చిన్నవాడ, బ్లఫ్ మాస్టర్, అభినేత్రి 2, కల్కి, కాపఠధారి వంటి సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ లో ఆమె రెండు సినిమాలతో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగుళూరుకు చెందిన నందిత శ్వేత తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అట్టకతి’, ‘ఈతిర్ నీచల్’, ‘ఇదార్కుథనే ఆసైపట్టై బాలకుమార’, ‘ముండాసుపట్టి’ మరియు ‘పులి’ చిత్రాలలో నటించి మంచి క్రేజ్ అందుకుంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘బిగ్ బాస్5’ మానస్ గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ లహరి షెరి గురించి ఈ 10 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్5’ ప్రియా గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus