ఈ మధ్య ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడం తగ్గించేశారు. సినిమా బాగున్నా.. కూడా చాలా మంది ప్రేక్షకులు థియేటర్ కి వెళ్లడం లేదు. అందువల్ల టికెట్లు తెగడం లేదు. నిర్మాతలకి, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగులుతున్నాయి. మరోపక్క శాటిలైట్ ఛానల్స్ కి కూడా సరైన రెవెన్యూ రావడం లేదు. ఎందుకంటే ఒకప్పటిలా డిష్, కేబుల్ టీవీ రీఛార్జ్..లు వంటివి జనాలు చేయించుకోవడం లేదు. ఎందుకంటే.. వైఫై పెట్టించుకుంటున్నారు. ఏడాదికి సరిపడా ఓటీటీల రీఛార్జ్..లు చేయించుకుంటున్నారు.
ఇక యూట్యూబ్లో లైవ్ లో న్యూస్ వంటివి చూసేయొచ్చు. అందుకే శాటిలైట్ ఛానల్స్ కి కూడా టీఆర్పీ..లు రావడం లేదు. దీనికి కూడా కారణం ఓటీటీలే. ఇక్కడ అన్ని రకాల కంటెంట్ దొరుకుతుంది. యూత్ ను టార్గెట్ చేస్తూ రొమాంటిక్ వెబ్ సిరీస్..లు కూడా రిలీజ్ అవుతున్నాయి. వీటిని ఓటీటీల్లో ఒరిజినల్ గా చూడొచ్చు. థియేటర్లలో ఇలాంటి సినిమాలకి సెన్సార్ కట్లు ఎక్కువ ఉంటాయి. టీవీల్లో కూడా చాలా వరకు చేసి టెలికాస్ట్ చేస్తుంటారు. ఓటీటీలకు ఎక్కువ నియమాలు లేవు.
అందుకే ఎలాంటి కంటెంట్ అయినా ఒరిజినల్ గా వస్తుంది. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ప్రస్తుతం ఒక వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. దాని పేరు ‘త్రిభువన్ మిశ్ర సీఏ టాపర్’ (Tribhuvan Mishra CA Topper). ఇది చాలా బోల్డ్ గా ఉంది. బెడ్ రూమ్ సీన్స్ వంటివి కూడా ఎక్కువగా ఉన్నాయి. ‘ఓ సీఏ టాపర్ మెగా వ్యభిచారిగా ఎలా మారాడు?’ అనే థీమ్ తో ఈ సిరీస్ రూపొందింది.
‘డబ్బు కోసం యువత ఎలాంటి చెడు మార్గాలు ఎంచుకుంటుంది?’ అనే మెసేజ్ కూడా ఇచ్చారు. ‘ఈ సిరీస్ ను (Tribhuvan Mishra CA Topper) చాలా ఒంటరిగా చూడాలి.. లేదు అంటే ఇబ్బంది పడతారు’ అంటూ ఈ సిరీస్ చూసిన వాళ్ళు చెబుతున్నారు. సోషల్ మీడియాలో దీని గురించి కొందరు చర్చించుకుంటున్నారు కూడా.! నెట్ ఫ్లిక్స్ లో ఇది అందుబాటులో ఉంది.