‘అనగనగా ఒక రాజు’ ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు అయింది. నవీన్ పొలిశెట్టి ఫుల్ స్వింగ్‌లో ఉన్నప్పుడు ఈ సినిమా సితార ఎంటర్‌టైన్మెంట్స్ ప్రకటించింది. భారీ స్థాయిలో ప్రచారంతో సినిమాను ప్రకటించారు కూడా. సుమారు రెండేళ్ల క్రితం అనౌన్స్ అయిన ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను (Sreeleela) తీసుకుంటున్నట్లు అప్పుడు చెప్పారు. అయితే ఇప్పుడు మొత్తం లెక్కలు మారిపోయాయి. ఆమె కూడా మారిపోయింది అని అంటున్నారు. అంతేకాదు దర్శకుడూ మారారు.
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) అంటూ గత ఏడాది అక్టోబరులో నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty) – అనుష్క శెట్టి వ (Anushka Shetty)చ్చారు. ఆ తర్వాత నవీన్ విదేశాలకు వెళ్లడం, అక్కడ యాక్సిడెంట్ అవ్వడం లాంటివి జరగడంతో సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడు తిరిగి ట్రాక్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో కొత్త సినిమా అనౌన్స్ చేస్తాడు, పాత సినిమాలు అలా ఉండిపోతాయి అని అన్నారు. కానీ పాత సినిమానే రీస్టార్ట్ చేశారు. ఈ మేరకు టీజర్ ప్రోమోను విడుదల చేశారు.
బాగా ధనవంతుడిగా ఈ సినిమాలో నవీన్ కనిపిస్తాడని రెండేళ్ల క్రితమే చెప్పారు. ఈ క్రమంలో నవ్వులు కూడా భారీగానే తీసుకొస్తాడు అని అన్నారు. ఇప్పుడు కూడా అదే మాట అంటున్నారు. అయితే ఈసారి కెప్టెన్, హీరోయిన్ మారిపోయారు. అంటే మారిపోయారని పక్కాగా చెప్పలేం కానీ.. టీజర్ ప్రోమోలో ఉన్న డీటెయిల్స్ ప్రకారం చూస్తే.. వాళ్ల పేర్లు అయితే కనిపించడం లేదు. దీంతో కొత్త దర్శకుడు, కథానాయిక పక్కా అని చెబుతున్నారు.
తొలుత చెప్పిన వివరాల ప్రకారం సినిమాకు కల్యాణ్ శంకర్ (Kalyan Krishna) దర్శకత్వం వహించాలి. కానీ ఇప్పుడు ఆయన పేరు ప్రోమోలో కానీ, డిస్‌క్రిప్షన్‌లో కానీ లేదు. కాబట్టి ఆయన లేనట్లే అని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ ప్రస్తావన కూడా ఎక్కడా లేదు. కాబట్టి కొత్త అందాన్ని నవీన్ పక్కన చూస్తాం అని చెప్పొచ్చు. అప్పుడెప్పుడో డేట్స్ కదా.. ఇప్పుడు అడిగితే ఎవరైనా ఇవ్వగలరా చెప్పండి. చూద్దాం ఈ రోజు టీజర్ వస్తుంది. క్లారిటీ అందులో ఉంటుందేమో.