మాస్ హీరో కోసం ఎదురుచూసి.. చివరికి!

టాలీవుడ్ లో ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ లాంటి హిట్ సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. ‘నేను లోకల్’ సినిమాతో పెద్ద హీరోల దృష్టి ఈ డైరెక్టర్ పై పడింది. వెంకటేష్, రవితేజ లాంటి హీరోల కోసం కథలు సిద్ధం చేశాడు త్రినాథరావు. దాదాపు వెంకటేష్ తో సినిమా ఖాయం అనుకున్న దశలో ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తరువాత రవితేజతో సినిమా చేయాలని ప్రయత్నించాడు. అయితే త్రినాథరావుని పక్కన పెట్టి.. మిగిలిన కథలను చేయడం మొదలుపెట్టాడు రవితేజ.

మాస్ హీరో కోసం చాలా కాలం పాటు ఎదురుచూసిన త్రినాథరావు ఇప్పుడు మరో హీరోని వెతుక్కున్నట్లు తెలుస్తోంది. యంగ్ హీరో హవీష్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడట. ‘నువ్విలా’ సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన హవీష్ ఆ తరువాత ‘జీనియస్’, ‘రామ్ లీలా’, ‘సెవెన్’ వంటి సినిమాల్లో నటించాడు. ఇందులో ఏదీ కూడా సక్సెస్ కాలేదు. దీంతో చాలా కాలంగా ఖాళీగానే ఉంటున్నాడు. ఇప్పుడు రవితేజ కోసం అనుకున్న కథను హవీష్ తీయాలని ఫిక్స్ అయ్యారట త్రినాథరావు.

రవితేజ కోసం రాసుకున్న స్టోరీని హవీష్ కి ఎలా సెట్ చేశారో మరి. నిజానికి నాని లాంటి హీరోతో పని చేసిన తరువాత పెద్ద హీరోలతో కలిసి పని చేయాలనుకుంటారు. కానీ త్రినాథరావుకి మాత్రం హిట్ ఇచ్చినా హీరోలు మాత్రం దొరకడం లేదు. దీంతో చేసేదేం లేక హవీష్ లాంటి కుర్ర హీరోతో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాతో సక్సెస్ అందుకున్నాకైనా స్టార్ హీరోలు ఛాన్స్ లు ఇస్తారేమో చూడాలి!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus