ఎడవెల్లి రాంరెడ్డి సమర్పణం లో లక్షిత ఆర్ట్స్ పతాకం పై తిరుపతి కె వర్మ దర్శకత్వం లో ఎడవెల్లి వెంకట్ రెడ్డి మరియు కాచిడి గోపాల్ రెడ్డి నిర్మాతలుగా నిర్మించబడుతున్న చిత్రం త్రినేత్రి. మేఘన,ఆరోహి మరియు వృశాలి ముఖ్య తారాగణం తో పోసాని కృష్ణ మురళి కీలక పాత్రలో నిర్మించబడుతుంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ పూర్తిచేసుకుని “సెన్సార్ కార్యక్రమాలకు అప్లై చేసారు”
ఈ సందర్భంగా నిర్మాతలు ఎడవెల్లి వెంకట్ రెడ్డి,కాచిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ “లక్షిత ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించబడుతున్న మొదటి చిత్రం ఇది. ఈ చిత్రానికి త్రినేత్రి అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టాము . మా సినిమా లో పోసాని కృష్ణ మురళి చేయటం మా అదృష్టం. వారికీ మరియు ఇతర నటి నటులకి మా కృతఙ్ఞతలు . పోసాని గారు మా సినిమా కథ విని కథ చాల బాగుంది అని ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని అన్నారు. సినిమా షూటింగ్ పూర్తియింది. హైదరాబాద్, వరంగల్, మంచిర్యాల. కరీంనగర్ వంటి వాస్తవిక లొకేషన్ లో షూటింగ్ చేశాం. ఈ సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేసాం” అని తెలిపారు.
ఎడవెల్లి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ “ఫస్ట్ కాపీ కొంత మంది ప్రముఖులు చూసి ఆడవాళ్ళ పై జరుగుతున్నా అన్యాయాలు అక్రమాల పై మంచి సినిమా వచ్చింది అని అభినందించారు” అని తెలిపారు.
దర్శకుడు తిరుపతి కె వర్మ మాట్లాడుతూ “ఇది ఆడవారికి సంభందించిన సినిమా. ప్రతిఒక్క మహిళా చూడదగ్గ సినిమా. ఇవాళ సమాజం లో ఆడవాళ్లపై జరుగుతున్నా యదార్ధ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా. ఆడవాళ్లు తెరగబడితే ఎలా ఉంటుంది అన్నదే ఈ సినిమా కథ. మా త్రినేత్రి సినిమా అందరిని అల్లరిస్తుంది. పోసాని కృష్ణ మురళి గారు కీలక పాత్రలో చేస్తున్నారు. వారి పాత్ర ఈ సినిమా కి హైలైట్ గా ఉంటుంది. మేఘన,ఆరోహి మరియు వృశాలి ముఖ్య తారాగణం తో నిర్మించబడుతున్న ఈ చిత్రానికి ఎడవెల్లి వెంకట్ రెడ్డి మరియు కాచిడి గోపాల్ రెడ్డి నిర్మాతలు. వారు నా కథ విని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నందుకు వారికీ నా ధన్యవాదాలు. ఈ సినిమా ట్రైలర్ ను సోషల్ మీడియా విడుదల చేయటం జరిగింది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదారించాలి అని కోరుకుంటూన్నం