Triptii Dimri: నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి త్రిప్తీ రియాక్షన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

సినిమా ఇండస్ట్రీలోని నటీనటులకు అదృష్టం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. యానిమల్ (Animal) సినిమాతో త్రిప్తీ దిమ్రి (Tripti Dimri)  పేరు భాషతో సంబంధం లేకుండా మారుమ్రోగింది. యానిమల్ సినిమా రిలీజైన తర్వాత త్రిప్తీ దిమ్రిని చాలామంది నేషనల్ క్రష్ అని సంబోధించడం జరుగుతోంది. తాజాగా నేషనల్ క్రష్ ట్యాగ్ గురించి త్రిప్తీ దిమ్రి రియాక్ట్ కాగా ఆమె చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. నేను బాలీవుడ్ ఇండస్ట్రీలో కెరీర్ ను మొదలుపెట్టి దాదాపుగా ఏడు సంవత్సరాలు అయిందని ఆమె అన్నారు.

నేను అందుకు సంతోషంగా ఉన్నానని ఆమె చెప్పుకొచ్చారు. గొప్ప నటీనటులు, దర్శకులతో వర్క్ చేస్తానని కెరీర్ తొలినాళ్లలో ఎప్పుడూ అనుకోలేదని త్రిప్తీ దిమ్రి వెల్లడించారు. ఎందుకంటే నేను యాక్టింగ్ ను సీరియస్ గా తీసుకోలేదని ఆమె కామెంట్లు చేశారు. ఫస్ట్ మూవీ పూర్తైన తర్వాత నేను నా కెరీర్ ను విధికే వదిలేశానని త్రిప్తీ దిమ్రి చెప్పుకొచ్చారు. ఒక సినిమాను పూర్తి చేశానని లక్ ఉంటే రెండో సినిమా రావచ్చని అనుకున్నానని ఆమె వెల్లడించారు.

అలాంటి సమయంలో లైలా మజ్ను సినిమా కోసం నేను అడిషన్ కు వెళ్లానని త్రిప్తీ దిమ్రి పేర్కొన్నారు. అప్పటినుంచి యాక్టింగ్ పై దృష్టి పెట్టి యాక్టింగ్ లో శిక్షణ తీసుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు నా యాక్టింగ్ తో కనెక్ట్ అవుతున్నారని ఆమె వెల్లడించారు. నేషనల్ క్రష్ అనేది నా దృష్టిలో ట్యాగ్ మాత్రమే కాదని అభిమానుల ప్రేమ అని త్రిప్తీ దిమ్రి అన్నారు.

వాళ్లు నన్ను అలా పిలుస్తున్నందుకు సంతోషంగా ఉందని త్రిప్తీ దిమ్రి పేర్కొన్నారు. ఇది నాపై మరింత బాధ్యతను పెంచిందని ఆమె వెల్లడించారు. ప్రేక్షకులను అలరించే సినిమాలలో నటించాలని ఉందని ఆమె తెలిపారు. త్రిప్తీ దిమ్రి వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus