నటనే వద్దన్నాడు.. అతన్నే వదిలేసాను : త్రిష

చెన్నై బ్యూటీ త్రిష గత ఏడాది పెళ్లి పీటలపై కూర్చోవాల్సింది. బిజినెస్ మ్యాన్ వరుణ్ మనియన్ తో నిశ్చితార్ధం కూడా జరిగింది. అయితే చివరి నిముషంలో వారి వివాహం క్యాన్సల్ అయింది. అప్పట్లో ఇందుకు కారణం ఏంటో తెలియరాలేదు. రీసెంట్ గా ఈ విషయం పై  త్రిష క్లారిటీ ఇచ్చింది. “నేను పెళ్లి అయిన తర్వాత కూడా నటిస్తానని వరుణ్ కి చెప్పాను. అతను వద్దన్నాడు. ఒప్పించడానికి ప్రయత్నించాను. నటించడానికి వీలు లేదని ఆర్డర్ వేసాడు. అందుకే పెళ్లిని క్యాన్సిల్ చేశాను” అని త్రిష వెల్లడించింది.

గత రెండేళ్లుగా ఈ బ్యూటీ నటించిన సినిమాలు విజయం సాధించలేదు. దీపావళికి విడుదలయిన తమిళ చిత్రం ధర్మయోగితో త్రిష మళ్లీ ఫామ్లోకి వచ్చింది.  ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సందర్భంగా త్రిష మీడియాతో మాట్లాడుతూ “నన్ను నటనలో అడ్డుచెప్పని వ్యక్తిని పెళ్లిచేసుకుంటాను. పెళ్లి అయిన తర్వాత గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే నటించను. ఎందుకంటే అప్పుడు హీరోయిన్ గా కనిపించలేను కదా. అందుకే అప్పుడు తప్ప, చివరి శ్వాస వరకు సినిమాల్లోనే ఉంటా” అని స్పష్టం చేసింది. సినిమానే జీవితము అనుకుంటున్న ఈ భామ మోహిని గా త్వరలో థియేటర్లలో సందడి చేయనుంది.

https://www.youtube.com/watch?v=bw9Bx8Kq5MQ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus