తెలుగు, తమిళ సినిమాల్లో అగ్ర కథానాయికగా వెలుగొందుతున్న త్రిష కృష్ణన్ (Trisha), రెండు దశాబ్దాల కెరీర్‌లో భారీ ఆస్తులు సంపాదించినట్లు తెలుస్తోంది. 1999లో తమిళ చిత్రం ‘జోడి’తో నటిగా అడుగుపెట్టిన త్రిష, ‘వర్షం’ (Varsham) సినిమాతో టాలీవుడ్‌లో స్టార్‌డమ్ సాధించింది. ప్రభాస్ (Prabhas) సరసన ఆ సినిమా ఆమె కెరీర్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ (Nuvvostanante Nenoddantana), ‘అతడు’ (Athadu) , ‘పొన్నియన్ సెల్వన్’ (Ponniyin Selvan) వంటి హిట్ సినిమాలతో ఆమె ప్రయాణం అజేయంగా సాగింది. 41 ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోయిన్లతో పోటీపడుతూ సీనియర్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
త్రిష ఒక్కో సినిమాకు రూ.3-5 కోట్లు సంపాదిస్తోంది. ‘పొన్నియన్ సెల్వన్: 1’ హిట్ తర్వాత ‘లియో’ (LEO) కోసం రూ.5 కోట్లు తీసుకుందని జాతీయ మీడియా చెబుతోంది. సినిమాలతో పాటు వాణిజ్య ప్రకటనల నుంచి ఏడాదికి రూ.9 కోట్లు ఆర్జిస్తోంది. ఆమె ఆస్తుల విలువ రూ.90 కోట్లుగా ఉందని అంచనా. హైదరాబాద్‌లో రూ.6 కోట్ల బంగ్లా, చెన్నైలో రూ.10 కోట్ల లగ్జరీ ఇల్లు ఆమె సొంతం.
అంతేకాదు, రూ.63 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్, బీఎండబ్ల్యూ కార్లు ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. ఇటీవల, త్రిష అజిత్(Ajith Kumar) సరసన ‘విదాముయార్చి’లో నటించింది, కానీ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు. ఇప్పుడు ఆమె మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సరసన ‘విశ్వంభర’లో (Vishwambhara) కనిపించబోతోంది. త్వరలో విడుదల కానున్న ‘థగ్ లైఫ్’ (Thug Life) లాంటి సినిమాలు ఆమె లైనప్‌లో ఉన్నాయి.
ఈ సినిమాలు ఆమె కెరీర్‌ను మరింత బలపరుస్తాయని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మార్కెట్ విలువ, పెరుగుతున్న ఆస్తుల ధరలతో త్రిష త్వరలో రూ.100 కోట్ల నికర ఆస్తుల క్లబ్‌లో చేరే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. 25 ఏళ్ల కెరీర్‌లో అనేక అవార్డులు, అభిమానుల ప్రేమతో త్రిష ఇప్పటికీ ‘సౌత్ క్వీన్’గా కొనసాగుతోంది. ఆమె విజయవంతమైన జర్నీ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తోంది.