Trisha: త్రిషకు కోపం వచ్చింది.. ఎందుకంటే..!

టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రేక్షకులకు బాగా పరిచయమైన స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ (Trisha) తాజాగా సోషల్ మీడియాలో తనదైన స్టైల్‌లో ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పటికీ హీరోయిన్‌గా వరుస ఆఫర్లతో బిజీగా ఉండే త్రిష, ఇటీవల అజిత్ కుమార్‌తో (Ajith Kumar) కలిసి నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ (Good Bad Ugly)  సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఆమె పాత్రపై వచ్చిన మిశ్రమ స్పందనలతో పాటు, సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలు ఎదురవడంతో త్రిష రెస్పాండ్ కావాల్సి వచ్చింది.

Trisha

ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా త్రిష చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ” అర్థంలేని కామెంట్లు చూస్తే ఆశ్చర్యంగా ఉంది. నిజంగా మీరు ప్రశాంతంగా నిద్రపోతున్నారా? ఇతరుల్ని ఇలా అపహాస్యం చేయడంలో సంతోషం ఉందా?” అంటూ ఆమె బూతులు, వ్యక్తిగత విమర్శలు చేసే వారిని ప్రశ్నించారు. అంతేకాకుండా “మీ గురించి కాదు, మీ చుట్టూ ఉన్నవాళ్ల గురించి బాధగా ఉంది” అంటూ ఎమోషనల్ టచ్ కూడా ఇచ్చారు.

త్రిష ఇంత వరకు ఎన్నో కామెంట్స్ ను ఎదుర్కొన్నా, ఎన్నడూ ఇలా స్పందించలేదు. కానీ ఈసారి వస్తున్న ట్రోలింగ్ మితిమీరిపోవడంతో ఆమె రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో ఆమె పాత్ర కొందరికి నచ్చకపోవచ్చు, కానీ దాన్ని వ్యక్తిగత దూషణలకు దారి తీసేలా వ్యాఖ్యలు చేయడం తగదని త్రిష హితవు చెప్పారు. ఇందులోని నటనపై పాజిటివ్ కామెంట్లు వచ్చినా, కొన్ని విమర్శలు పూర్తిగా వ్యక్తిగత దాడులవుతున్నాయని ఆమె భావించారు.

ఇక సినిమా విషయానికి వస్తే, అజిత్‌తో కలిసి త్రిష చేసిన ఈ సినిమా మొదటి రోజే దాదాపు 29 కోట్లకు పైగా వసూలు చేసింది. డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్ (Adhik Ravichandran)  ఈ చిత్రాన్ని యాక్షన్, ఎమోషన్ మిక్స్‌తో రూపొందించారు. త్రిష పాత్రలోని కొన్ని సీన్స్ కొందరిని ఆకట్టుకోగా, మరికొందరు నెగిటివ్‌గా స్పందించారు. మొత్తానికి త్రిష ఇచ్చిన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె స్టేట్‌మెంట్ చూసి ఫ్యాన్స్ మాత్రం పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి త్రిష స్పందనతో ట్రోలింగ్‌కు ఎంతమేర తగ్గుదల వస్తుందో చూడాలి.

విజయ్ న్యూ ప్రాజెక్ట్.. జస్ట్ నాలుగు నెలల్లోనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus