థేమ్స్ నదిలో ‘మోహిని’ ..!

కేవలం గ్లామరస్ పాత్రలకే పరిమితం కాకుండా.. విభిన్నమైన పాత్రలకూ ప్రాధాన్యత ఇస్తోంది త్రిష. ‘కళావతి’ చిత్రంలో ప్రేక్షకులను భయపెట్టిన త్రిష.. ఇప్పుడు ‘నాయకి’గా మరోహారర్ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుండగా, కోడి చిత్రంలో ఓ రాజకీయ నాయకురాలిగానూ విభిన్న పాత్రలో నటిస్తోంది.

ప్రస్తుతం మాదేశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో హారర్ చిత్రంలోనూ త్రిష నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం లండన్ లో జరుగుతుండగా.. అక్కడ పలు సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. పర్యాటక ప్రాంతమైన థేమ్స్ నది పరిసర ప్రాంతాల్లోనూ ఈ చిత్ర షూటింగ్ జరుపుకుంటోంది. అక్కడ షూటింగ్ జరుపుకుంటుండగా పలు ఫోటోలను తన ట్విట్టర్ అక్కౌంట్ ద్వారా త్రిష తన అభిమానులతో పంచుకుంది. కొన్ని యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాణి తెరకెక్కిస్తున్నారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus