Trisha: ప్రభాస్ గురించి చెప్పడం మర్చిపోయి ఇరుక్కుపోయిందే!

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయింది త్రిష. యూత్ లో ఆమెకి విపరీతమైన క్రేజ్ ఉండేది. చాలా ఏళ్లపాటు ఇండస్ట్రీని ఏలింది. ఆ తరువాత అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయింది. రీసెంట్ గా మణిరత్నం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాలో కనిపించింది త్రిష. ఈ సినిమాలో ఆమె పాత్ర బాగానే పండింది.

చాలా మంది సినిమాలో ఐశ్వర్యారాయ్ కంటే త్రిష బాగుందని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెకి మళ్లీ అవకాశాలు పెరిగాయి. తెలుగులో మాత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమాకి ఆశించిన స్థాయిలో పేరు రాలేదు. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా త్రిష నటించిన ‘వర్షం’ సినిమా రీరిలీజ్ అయింది. ప్రభాస్ ఇండస్ట్రీలోకి వచ్చి ఇరవై ఏళ్లు అవుతున్న సందర్భంగా ‘వర్షం’ సినిమా స్పెషల్ షోలు వేశారు. కొన్ని ఏరియాల్లో ఈ సినిమాకి హౌస్ ఫుల్ కలెక్షన్స్ వచ్చినా.. కొన్ని ఏరియాల్లో మాత్రం వర్కవుట్ అవ్వలేదు.

ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం థియేటర్లలో రచ్చ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. వీటిలో ఒక వీడియోను త్రిష తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి.. 18 ఏళ్ల తరువాత మళ్లీ ఈ సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ వస్తుండడం ఆనందంగా ఉందని.. తన ఫస్ట్ తెలుగు సినిమా అని.. ఈ ప్రేమ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నానంటూ అభిమానులను కొనియాడింది. ‘వర్షం’ సినిమా రీరిలీజ్ ప్లాన్ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్.

థియేటర్లలో సందడి చేసింది కూడా వారే. అలాంటప్పుడు ప్రభాస్ గురించి.. చిత్రబృందం గురించి రెండు మాటలు మాట్లాడితే బాగుండేది. కానీ త్రిష అలా చేయలేదు. రీరిలీజ్ ప్లాన్ చేసింది ప్రభాస్ కోసం, థియేటర్లలో రచ్చ చేసింది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే తన ఫ్యాన్స్ చేసినట్లుగా త్రిష పోస్ట్ చేయడం వారికి నచ్చలేదు. దీంతో ఆమెని ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus