ఎన్టీయార్, కళ్యాణ్ రామ్ లను ఇంత ఎమోషనల్ గా ఎప్పుడూ చూడలేదు!

“మేమందరం నాన్న పిచ్చోళ్లం” అని ఎన్టీయార్ “నాన్నకు ప్రేమతో” స్టేజ్ మీద చెప్పిన మాటల్ని అంత త్వరగా ఎవరూ మర్చిపోలేరు. తండ్రి మీద విపరీతమైన ప్రేమ, అభిమానం కలిగిన ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ ఇటీవల మరణించినప్పుడు కొడుకుగా ఎన్టీఆర్ కంటే ఎక్కువగా ఆయన అభిమానులు, ఎన్టీయార్ గురించి పర్సనల్ గా తెలిసినవాళ్ళందరూ తల్లడిల్లిపోయారు. అటువంటి తారక్-కళ్యాణ్ కలిసిన హాజరైన “అరవింద సమేత” ప్రీరిలీజ్ ఈవెంట్ ఒక నార్మల్ సినిమా ఫంక్షన్ లా కాకుండా ఒక ఎమోషనల్ జర్నీలా సాగింది. తండ్రి హరికృష్ణను తలచుకొని కన్నీరు పెడుతూ “ఎడబోయాడో” పాటలోని తొలి రెండు చరణాలను పాడడం, ఆ పాట పాడుతున్నంతసేపూ ఎన్టీయార్ కళ్ళలో నీరు తిరగడం చూసిన అభిమానులు కూడా కంట తడి పెట్టుకొన్నారు.

ఇక జగపతిబాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్టీయార్ ఔన్నిత్యాన్ని పొగిడిన విధానం, చెప్పిన సందర్భాలు.. అన్నిటికంటే ముఖ్యంగా “ఈ సినిమా టైమ్ లో జరిగిన అతిపెద్ద విషాదం నుంచి అతి తొందరగా కోలుకొని జీవితంలో కూడా నిజమైన హీరో అని ప్రూవ్ చేసుకొన్న నందమూరి తారకరామారావు గారికి నా కృతజ్ణతలు, నా ప్రేమ, నా అభినందనలు” అని త్రివిక్రమ్ స్పీచ్ ఎండ్ చేయడం హైలైట్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus