గంటన్నర పైనే జరిగిన.. మహేష్ – త్రివిక్రమ్ ల మీటింగ్..!

‘అతడు’ ‘ఖలేజా’ వంటి కల్ట్ క్లాసిక్ సినిమాల తరువాత మళ్ళీ మహేష్ – త్రివిక్రమ్ ల కాంబినేషన్లో ఎప్పుడు సినిమా వస్తుందా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. త్రివిక్రమ్ కూడా మహేష్ బాబుకి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘అఆ’ వంటి స్క్రిప్ట్ లు వినిపించాడు. కానీ ఈ కాంబో పై ఉన్న అంచనాలను.. ఆ సినిమాలు అందుకోలేవు అని మహేష్.. ఆ సినిమాలను సున్నితంగా తిరస్కరించాడట. ఈ క్రమంలో వీరి కాంబోలో ఇప్పట్లో సినిమా వచ్చే అవకాశం లేదని.. వీరి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయి లైట్ తీసుకున్నారు.

కానీ ఇటీవల వీరిద్దరి మధ్య జరిగిన సడెన్ మీటింగ్.. మళ్ళీ ఫ్యాన్స్ లో ఊరట కలిగించిందనే చెప్పాలి. ఈ మధ్యనే మహేష్ ను కలిశాడట త్రివిక్రమ్. వీరిద్దరి మధ్య గంటన్నర పైనే డిస్కషన్ జరిగిందట. అది స్క్రిప్ట్ కోసమే అని ఇన్సైడ్ టాక్. మహేష్ కూడా త్రివిక్రమ్ వినిపించిన స్క్రిప్ట్ కు పాజిటివ్ గా స్పందించాడని తెలుస్తుంది. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ వారు మహేష్ కు ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మహేష్ – త్రివిక్రమ్ ప్రాజెక్టు సెట్ అయ్యే అవకాశం ఉందనేది తాజా సమాచారం.

అయితే ఎన్టీఆర్ తో కూడా త్రివిక్రమ్ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. కానీ అది ‘ఆర్.ఆర్.ఆర్’ పూర్తయిన తరువాతే.! దానికి ఇంకా రెండేళ్లు టైం పట్టినా ఆశ్చర్యపడనవసరం లేదు. దీనిని బట్టి చూస్తుంటే.. ‘సర్కారు వారి పాట’ పూర్తయిన తరువాత మహేష్ – త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు..!

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్‌ 4 హైలెట్స్: బిగ్‌బాస్‌ ఇలా రోజూ అయితే కష్టమే!
బిగ్‌బాస్‌ 4: ఇంట్లో వాళ్లు ఒకరు… బయటి నుంచి ముగ్గురట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus