నవంబర్ నుంచి పవన్-త్రివిక్రమ్ ల చిత్రం..?

  • June 1, 2016 / 01:21 PM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం ‘అ..ఆ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రం జూన్ 2 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత త్రివిక్రమ్ ఎవరితో కలిసి పనిచేయనున్నాడన్నది మాత్రం ఇంకా ఖరారు కాలేదు. సూర్యతో కలిసి త్రివిక్రమ్ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని వార్తలు వినవచ్చినప్పటికీ..

ప్రస్తుతం సూర్య ఎస్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు పవన్-దాసరి కాంబోలో రానున్న చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నాడని.. ఈ చిత్రం నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినవస్తున్నాయి. ఈ వార్తల్లో నిజమెంతుదన్న విషయం తెలియాల్సి ఉండగా.. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా, అత్తారింటికి దారేది చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus