Ravi Teja: రవితేజ వారసుడు కూడా అక్కడే.. పెద్ద ప్లానే..!

టాలీవుడ్ లో కొత్త తరం టాలెంట్ అడుగుపెడుతూనే ఉంది. స్టార్ హీరోలు, దర్శకుల వారసులు కూడా కాస్త వెనకబడకుండా తమ మార్గంలో ముందుకు సాగుతున్నారు. తాజాగా సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారిన వార్త ఏంటంటే.. త్రివిక్రమ్ కొడుకు రిషి, రవితేజ (Ravi Teja) కొడుకు మహాధన్ ఇద్దరూ స్పిరిట్ (Spirit)  మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారట. సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga)  దర్శకత్వంలో ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న స్పిరిట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.

Ravi Teja

కానీ ఈ సినిమా షూటింగ్ లో కేవలం స్టార్ హీరోనే కాదు, ఫ్యూచర్ ఫిల్మ్ మేకర్స్ కూడా ఉన్నారు. రిషి, మహాధన్ ఇద్దరూ ఈ సెట్స్ పై అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేస్తున్నారన్న వార్తతో సినీ వర్గాల్లో ఆసక్తి పెరిగింది. త్రివిక్రమ్ (Trivikram) తన కుమారుడు రిషిని కేవలం గ్లామర్ వర్గంలో కాదు, టెక్నికల్ గా కూడా బలంగా నిలిపే ప్రయత్నంలో ఉన్నారు. విజయ్ దేవరకొండ  (Vijay Devarakonda) – గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri)  సినిమాకు రిషి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయగా, ఇప్పుడు సందీప్ వంగా టీమ్ లో చేరాడు.

ఇదే సమయంలో రవితేజ తన కొడుకు మహాధన్ ను కూడా అదే బాటలో నడిపిస్తున్నాడట. మహాధన్ రాజా ది గ్రేట్ (Raja The Great) లో చిన్న పాత్రలో నటించినప్పటికీ, ఆపై ఆయన కెరీర్ లో స్పష్టత లేదు. కానీ ఇప్పుడు డైరెక్షన్ వైపు అడుగులు వేస్తున్నాడు. తండ్రిలాగే టెక్నికల్ గా ట్రైనింగ్ తీసుకుని, సినీ మాధ్యమాన్ని లోతుగా అర్థం చేసుకోవాలన్న దిశలో ముందుకెళ్తున్నాడు.

ఇక సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతోంది. త్రివిక్రమ్, రవితేజ (Ravi Teja) వంటి స్టార్ ల వారసులు కెమెరా వెనక ట్రైనింగ్ తీసుకుంటుండడం అభిమానులను ఆకర్షిస్తోంది. రిషి, మహాధన్ తమ తండ్రుల లాగా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకుంటారనే ఆశతో నెటిజన్లు వారికి బెస్ట్ విషెస్ చెబుతున్నారు. మొత్తానికి స్పిరిట్ సినిమా కేవలం ప్రభాస్ మాత్రమే కాదు.. ఈ వారసులకూ లాంచింగ్ ప్లాట్‌ఫామ్ గా నిలవనుంది.

హిట్టు కథకు రీమేక్.. వెంకీ కూడా చేస్తున్నాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus