Trivikram: ఖిలాడి భామలపైనే త్రివిక్రమ్ ఫోకస్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎలాంటి సినిమా చేసినా కూడా దాదాపు అందులో సక్సెస్ ఫార్ములాలను ఎక్కువగానే వాడుతూ ఉంటాడు అని అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండడం అనేది సర్వసాధారణంగా మారిపోయింది. ఇక రాబోయే సినిమాల్లో కూడా అదే తరహాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ఫార్ములా కొనసాగించ బోతున్నట్లుగా టాక్ నడుస్తోంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ చివరగా అల్లు అర్జున్ తో అల వైకుంఠపురములో సినిమా చేయగా అది ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Click Here To Watch

ఇక ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మరో సినిమా మొదలు పెట్టాలని అనుకున్నప్పటికీ కూడా అయితే వర్కౌట్ కాలేదు. ఇక వెంటనే మహేష్ బాబు తో సినిమా చేయడానికి రంగంలోకి దిగిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ప్రాజెక్టును కూడా అంత త్వరగా సెట్ అయితే చేసుకోలేకపోయాడు. అయితే ఫైనల్ గా మరొక్క సారి గట్టిగా కూర్చున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి కథనం పవర్ఫుల్ గా సిద్ధం చేయడంతో మహేష్ బాబు వెంటనే ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల అఫీషియల్గా పూజా కార్యక్రమాలు కూడా చేశారు. అయితే ఈ సినిమా కోసం మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే ను ఫైనల్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే త్రివిక్రమ్ మరొక హీరోయిన్ కోసం కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఇంతకుముందు చాలా మంది పేర్లు వినిపించినప్పటికీ కూడా ఎవరినీ ఫైనలై చేయలేదు. ఇక ఇప్పుడు ప్రస్తుతం ఈ స్టార్ దర్శకుడు ఖిలాడి భామలపై ఫోకస్ పెట్టినట్లుగా సమాచారం. ఆ సినిమాలో మీనాక్షి చౌదరి డింపుల్ హయాతి ఇద్దరు కూడా గ్లామర్ పాత్రలతో గట్టిగానే పోటీపడ్డారు.

ఇక ఎక్కువగా అందరి చూపు అయితే మీనాక్షి చౌదరి పైనే ఉన్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా రిజల్ట్ ను బట్టి ఎవరి పాత్ర ఎంత క్లిక్ అవుతుంది అని ఆలోచనతో త్రివిక్రమ్ ఒక హీరోయిన్ ఫైనల్ చేసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus